adwani

“రథ”యాత్రికునికి”రత్నం”…

భారతీయ జనతా పార్టీ కురు వృద్ధులు లాల్ కిషన్ అద్వాని దేశ అత్యున్నత పురస్కారమైన “భారత రత్న” వరించింది. దేశంలో బిజెపి మూలాలు విస్తరించడానికి ఆయన సేవలు ఇతోధికంగా తోడ్పడ్డాయి. 1990 దశకంలో అయోధ్య రామ మందిర వివాదం పై అద్వాని జరిపిన “రథ యాత్ర” బిజెపి, సంఘ్ పరివార్ లు ఎప్పటికీ మర్చిపోలేనిది. ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయనను “రత్న”తో పురస్కరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Read More
four c

ఆంధ్రాలో ఆ “నలుగురు”..!

ఆంధ్రప్రదేశ్ లో వడివడిగా మారిన రాజకీయ పరిణామాలు నిజంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కొద్ది రోజుల్లో  అక్కడ జరగనున్న ఎన్నికల తంతు రెండు కుటుంబాల చుట్టూనే తిరిగే విచిత్రమైన  పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి రాజకీయ చదరంగంలోకి షర్మిల, పురందేశ్వరి రెండు ప్రధాన జాతీయ పార్టీల పగ్గాలు చేత పట్టు కోవడంతో  ఆంధ్ర రాజకీయాల్లో కొంత కాలం కిందటి  వరకు ఉన్న సమీకరణలు  క్రమేపీ మారుతూ వస్తున్నాయి.  రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు  రెండు కుటుంబాల చేతిలోనే…

Read More
jagansrmil

అక్కడ ఇక రసవత్తరం…!

కొద్ది నెలల్లో జరగనున్న ఆంద్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. వివిధ జిల్లాల్లోని 175 నియోజక వర్గాలకు జరిగే పోరులో ప్రధానంగా ఐదు రాజకీయ పక్షాలు తలపడనున్నాయి. దీని కోసం ఇప్పటి నుంచే ఎత్తులు, పై ఎత్తులు, సమీకరణలకు నడుం బిగించాయి. ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో  రాజకీయ రచ్చబండ వద్ద కొత్త తరహా చర్చలకు తెరలేపింది. జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో అంధ్రలో ఒక్కసారిగా జవసత్వాలు…

Read More
banana c

రాజకీయాల్లో”అరటి పండ్లు”…!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో “అరటి పండు”పార్టీల ఎత్తుగడలు అంతుపట్టకుండా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న జనసేన, వై.ఎస్.షర్మిల ఆధ్వర్యం లోని వై.ఎస్.ఆర్.తెలంగాణ (వైఎస్ఆర్ టి) పార్టీలు ఎన్నికల సమయంలో వ్యవహరిస్తున్న తీరు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలవ్వగానే తమ బలం ఎంత ఉన్నదనే కనీస విషయాన్ని అంచనా వేసుకోకుండా బరిలోకి దిగడం వెనుక అసలు రహస్యం ఏమిటనే  కోణంలో చర్చలకు తెర లేస్తోంది. తెలంగాణ శాసనసభకు గత నెలలో జరిగిన…

Read More
cht cm vistnudev

విష్ణుదేవ్‌ కి”ఛత్తీస్‌”పగ్గాలు…

చత్తీస్‌గఢ్‌ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌సాయ్ ఎన్నికయ్యారు. చత్తీస్‌గఢ్‌ శాసన సభ బిజెపి పక్ష నేతగా విష్ణుదేవ్‌సాయ్ ని ఎన్నుకున్నారు. రమణ్‌సింగ్‌ ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనే ఉహాగానాలకు బిజెపి మాజీ ఎంపీ విష్ణుదేవ్‌సాయ్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎంపిక చేసింది.

Read More
glass copy

“గ్లాసు” ముట్టని ఓటరు…!

తెలంగాణ ప్రాంతంలో  మేకపోతు గాంభీర్యం చూపించిన జనసేన పార్టీని ప్రజలు ఖాతరు చేయలేదు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్టు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆ పార్టీ క్యాడర్ ఒక్కసారిగా న్యూట్రల్ మోడ్ లోకి వెళ్ళింది. కనీసం ఆంధ్రాలో మాదిరిగా ఇక్కడ కూడా జనసేనతో బరిలోకి దిగుతుందేమో అని అంచనా వేశారు. కానీ, తెలుగుదేశంతో సంబంధం లేకుండా తెలంగాణలో జనసేన ఒంటరిగానే రంగంలోకి దూకే ప్రయత్నం చేసింది. అందుకే 32 స్థానాల్లో పోటీ చేస్తుందని…

Read More
surve 1c

ఒంటెద్దు పోకడ-అతి ఆలోచనలు..!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత  మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఉద్యమ పార్టీగా పిలవబడుతున్న బీఆర్‌ఎస్‌కు ఎదురే లేదు, కాంగ్రెస్‌ ఇక రాదు అనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల ముందు ఉన్న పరిస్థితులు పోలింగ్ నాటికి ఒక్కసారిగా తిరగబడ్డాయి. రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు పడుతున్న ప్రజలకు “ఒక్క ఛాన్స్” ఇవ్వడి అంటూ పక్కాగా అమలు చేసే ఆరు రకాల గ్యారంటీ పధకాలతో కాంగ్రెస్ పార్టీ , “హ్యాట్రిక్‌” విజయంపై గట్టి…

Read More
rahul priya

కెసిఆర్ చదివిన స్కూలు మేము కట్టిందే…!

తెలంగాణను ప్రతేక రాష్ట్రంగా చేసి, ఇక్కడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీయే అని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్పారు. కెసిఆర్ చదువుకున్న స్కూలుని కట్టించిది కుడా కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పదేపదే అడుగుతున్న ప్రశ్నకు ఇదే నా సమాధానం అన్నారు.  తెలంగాణ ముసుగులో బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా ప్రజలను నిలువు దోపిడీ చేసిందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు…

Read More
modi kamrdy

బిఆర్ఎస్ గద్దె దిగడం ఖాయం…

వచ్చే నెల 3వ తేదీన తెలంగాణలో ప్రజలు బిఆర్ఎస్ పార్టీని గద్దె దించుతారనే నమ్మకం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల్లో ఎన్నోఆశలు కన్పిస్తున్నాయని వాటిని నెరవేర్చుకోవడానికి మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గాలి వస్తుందన్నారు. శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. దేశంలో  7 దశబ్దాలు పాలించిన  కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎమి చేయాలేదని అదేవిధంగా పదేళ్లుగా రాష్ట్రంలో…

Read More
priyanka meet

కెసిఆర్ కుటుంబానికే ఉద్యోగాలు…!

బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదను పారిశ్రామికవేత్త ఆధానికి దోచి పెడుతున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. హుస్నాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ దేశంలో పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన ఆదాని ఒక రోజు సంపాదన 1600 కోట్లు అని తెలిపారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం బడ పారిశ్రామికవేత్తలకు  తొత్తుగా మారి దేశ సంపదను అప్పనంగా…

Read More
sanjay

‘‘యూజ్ లెస్ ఫెలో”….

‘‘యూజ్ లెస్ ఫెలో… ఉద్యోగాలు ఎందుకివ్వడం లేదని నిరుద్యోగులు నిరసన తెలిపితే సముదాయిం చాాల్సింది పోయి తిడతావా? దవడ పళ్లు రాలకొడితే సరి… కండకావరమెక్కి మాట్లాడుతున్నవ్. ఒక్కసారి మడతల చొక్కా.. అరిగిన రబ్బర్ చెప్పులేసుకున్న నీ గతాన్ని గుర్తు చేసుకో’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో కేటీఆర్ పై ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గం గంగాధరలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాటాడుతూ బిఆర్ఎస్, కాంగ్రెస్…

Read More
cupbjp

BJP Lose World Cup…!

The Indian National Congress (Indira Gandhi in 1983, Manmohan Singh in 2011), the Indian cricket teams have won the World Cup twice. Is it possible for the third grand victory of Bharatiya Janata Party Prime Minister Narendra Modi who blended patriotism with Hindutva? The northern captains (Kapil Dev, Mahendra Singh Dhoni) led the Indian teams…

Read More
pawan 56

“కమల”దళంతో కనిపించని “తమ్ముడు”…!

తెలంగాణ శాసన సభ ఎన్నికల తేదీ సమీపిస్తున్నా ప్రచారంలో జనసేన జాడ కనిపించక పోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకొని తొమ్మిది నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ప్రచార తెరపై కనిపించక పోవడంతో ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజక వర్గాల్లో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూసుకు పోతుంటే జనసేనా కనీసం…

Read More
3 party

కాంగ్రెస్ కి 74 సీట్లు : లోక్ పోల్

తెలంగాణ ఎన్నికలపై ప్రముఖ సర్వే సంస్థ లోక్‌పోల్‌ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రానుంది. 74 సీట్లతో కాంగ్రెస్‌ తిరుగులేని విజయం సొంతం చేసుకోబోతోందని, లోక్‌పోల్‌ సర్వే సంస్థ వెల్లడించింది. సీఎం కేసీఆర్‌ కామారెడ్డి- గజ్వేల్‌లో రెండు చోట్లా విజయం సాధించనుండగా, బీఆర్‌ఎస్‌కు మొత్తంగా కేవలం 29 స్థానాలు మాత్రమే దక్కనున్నట్లు పేర్కొంది. ఇక బీజేపీకి 9, మజ్లిస్‌కు 6 స్థానాలు వస్తాయని వెల్లడించింది.  ప్రధానంగా నల్లగొండ, ఖమ్మం  జిల్లాల్లో కాంగ్రెస్‌ దాదాపు అన్ని సీట్లలో…

Read More
vijsnti karge

ఈ సారి కాంగ్రెస్…

సినీ నటి, మాజీ ఎం.పి. విజయ శాంతి ఈ సారి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. తగిన ప్రాధాన్యత దక్కడంలేదని భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

Read More