సాక్ష్యం చూపరు…బెయిల్ ఇవ్వరు…!
అనుమానితులు, నిందితులను పట్టుకున్న 14 రోజుల్లో నేర పరిశోధన పూర్తి చేసి ఆధారాలను కోర్టు ముందు ఉంచాల్సిన పోలీసు యంత్రాంగం నిర్లిప్తత వల్ల అనేక మంది రిమాండ్ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం, అధికారులు, రాజకీయ నేతల తెరచాటు జోక్యం, వాళ్ల ఒత్తిళ్లు ఖైదీలకు శాపంగా మారుతోంది. చట్టల్లోని లొసుగులు కూడా కేసుల సాగదీతకు కారణం అవుతున్నాయి. ఫలితంగా రిమాండ్ ఖైదీల పరిస్థితి దయనీయంగా మారుతోంది. దోపిడి, దొంగతనాల కేసుల్లో దొరికిన నిందితుల విషయాన్ని పక్కన…