canpn

“బక్కోడు..గుండోడు..నీ అయ్యా..”! ఇదే తీరు…

తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నాకొద్దీ వివిధ రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధానంగా బిఆరేస్, కాంగ్రెస్, బిజెపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ఇంత వరకు ఎన్నడూ లేని విధంగా ప్రచార తీరు గాడి తప్పుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికల ప్రచార సభల్లో నేతల ప్రసంగాల తీరును పరిశీలిస్తే రాజకీయాల కంటే వ్యక్తి గత విమర్శలు, దూషణలకు దిగుతున్నట్టు స్పష్టం అవుతోంది. ఏ ఎన్నికల్లోనైనా సరే అధికార పార్టీ పై విపక్షాలు,…

Read More
sena ycp

నిలకడ లేని “పవన్”…

పవన్ కళ్యాణ్ ని నమ్ముకుంటే అందర్ని రోడ్డునపడేసి నట్టేట ముంచుతాడని జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పసుపులేటి సందీప్,జనసేన పార్టీ రాయలసీమ రీజియన్ సమన్వయకర్త పసుపులేటి పద్మావతిలు ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వారు వైయస్సార్ సిపిలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వైఖరిపై పలు ప్రశ్నలు కురిపించారు. అందర్ని ప్రశ్నిస్తానని,రాజకీయాలలో మార్పు తెస్తానని చెప్పే పవన్ లో నిలకడలేదని, ధైర్యం…

Read More
jagan babu.jpg c

అటు“బెయిల్”బలం – ఇటు అసహనం…!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరు కావడం అక్కడి ప్రధాన ప్రత్యర్ధి వైసిపి నేతలకు మింగుడు పడడం లేదా? బాబు అరెస్టుకు అనేక ఆధారాలు ఉన్నాయంటున్న అధికార పార్టీ నేతలు, కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు కోర్టు విశ్వాసాన్ని కోల్పోయారా? ఆరోపణలకు తగిన ఆధారాలు చూపడంలో పోలీసు అధికారులు, విచారణ సంస్థ విఫలమైందా? బాబుకు బెయిల్ రావడంతో వైసిపి నేతల్లో అసహనం ఎందుకు పెరిగింది? తెలుగు రాష్ట్రాల ప్రజల్లో సోమవారం…

Read More
uttam

తండ్రీ, కొడుకుల అబద్ధాలు….

ఎన్నికల ప్రచారంలో కేసీఆర్,కేటీఆర్ ,హరిష్ రావు లు ఓటమి భయం తో అబద్దాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు బంధు ఆపాలని నేను గానీ, కాంగ్రెస్ నేతలు కూడా ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. గత నెలలో రైతు బంధు ,దళిత బంధు ,బీసీ బంధు ,రుణమాఫీ లు నామినేషన్ ప్రక్రియ కంటే ముందే విడుదల చేయాలని డిమాండ్ చేసినట్టు గుర్తు చేశారు.రైతుబంధు ఆపాలని కాదని, దాన్ని మరింతగా పెంచాలని డిమాండ్…

Read More
lift c

ఇక పంట పొలాల”పల్నాడు”…!

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు ప్రాంత ప్రజల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కృష్ణా నది ఒడ్డునే ఉన్నప్పటికీ మాచర్లకు కృష్ణమ్మ నీళ్లు అందని పరిస్థితి నెలకొందని చెప్పారు. పల్నాడుకు వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు అవసరం ఎంతుందనేది తెలిసిన అతికొద్దిమందిలో తానూ ఒకడినని చెప్పారు. దశాబ్దాలుగా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా నెల ముందు గత పాలకులు ఈ…

Read More
jagana police c

“ఖాకీ” అంటే త్యాగనిరతి…

పోలీసులు వేసుకునే ఖాకీ డ్రెస్ అంటేనే త్యాగనిరతికి నిలువెత్తు సాక్ష్యం అనీ, పోలీస్‌ అంటే అధికారం మాత్రమే కాదనీ, సమాజంలో అతను ఒక బాధ్యత గల వ్యక్తీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. నేరం వేగంగా తన రూపాన్ని మార్చుకుంటున్న ఈ యుగంలో అంతకుమించిన వేగాన్ని అందుకుంటేనే పోలీసింగ్‌కు మరింత విలువ పెరుగుతుందన్నారు. జన రక్షణ…

Read More
IMG 20230929 WA0002

ఇక “కురుక్షేత్రం”…

ఆంధ్రప్రదేశ్ లో కురు క్షేత్ర యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి, పేదలను వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం ఉంటుందని తెలిపారు. పేదలకు, పెత్తందారులకూ మధ్య యుద్ధం జరగనుందని పేర్కొన్నారు.అమరావతి పేరుతో స్కామ్‌, స్కిల్‌ స్కామ్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ గ్రిడ్‌, నీరు-చెట్టు పేరుతో దోపీడీ చేసిన వారితో యుద్ధం జరగబోతుందని జగన్ అన్నారు. విజయవాడలో వరుసగా అయిదో ఏడాది వాహన మిత్ర నిధులను జగన్‌ విడుదల…

Read More
IMG 20230915 WA0031

భేటీ…

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కాంగ్రెస్ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఏఐసీసీ తెలంగాణా ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో.చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ తదితరులు హైటెక్ సిటీ మాదాపూర్ లోని తుమ్మల నివాసానికి వెళ్లారు. రాబోయే ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థతులపై చర్చించారు.

Read More
IMG 20230907 WA0015

ఇంకో చిరుత…

అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో వెళ్లే భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు, భక్తుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఏడవ మైలు శ్రీ నరసింహస్వామి ఆలయం సమీపంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుతను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాత్రి పన్నెండు, ఒంటి గంట మధ్య ఈ…

Read More
images 28

శ్వేతాకి నోటీసులు..

చైనాకు గ్రానైట్ రాయి ఎగుమతుల్లో శ్వేతా గ్రైనేట్స్ అక్రమాలకు పాల్పడినట్టు కేంద్ర ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఈ మేరకు తెలంగాణా రాష్ట్ర పౌస రఫరాల శాఖ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడి నోటీసులు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలకు విరుద్ధంగా శ్వేత ఏజెన్సీస్ 4.8 కోట్ల రూపాయల ఉల్లంఘన కి కి పాల్పడినట్టు ఈ.డి. పేర్కొంది.గ్రైనేట్ మెటీరియల్ ఎగుమతి చేయడంలో ఈ అక్రమాలు జరిగినట్లు…

Read More
sajjal

పోలవరం”బాబు”ఏ.టీ.ఎం…

పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏటీఎం మాదిరి వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.అప్పట్లో ప్రధాని మోడీ అన్నట్లుగానే చంద్రబాబు ప్రతి పనిలోనూ అడ్డగోలుగా ముడుపులు మింగారని ఆరోపించారు. బాబు సహా అయన ముఠా మొత్తానికి ఈ కుంభకోణంలో ఉందన్నారు. సచివాలయం భవనాలు, టిడ్కో ఇళ్ళు ఇలా ప్రతి పనిలోనూ చంద్రబాబు అనుచరులు లబ్ధి పొందారన్నారు. ప్రభుత్వ పనులకు సంబంధించి ఎల్ అండ్ టి, షాపూర్ జి సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చి…

Read More
ipr

ఆలోచిస్తున్నాం…

రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో పనిచేస్తున్న విలేకర్ల ఇళ్ళ స్థలాల సమస్యని విలైనంత త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నించనున్నట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నాయకులు కలసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించే దిశలో ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, కార్యదర్శి ఎస్ కే…

Read More
cong sitadayakar

కాంగ్రెస్ లోకి..

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు.రేవంత్ రెడ్డి నివాసానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆమె రేవంత్ తో సమావేశం అయ్యారు. మరి కొద్ది రోజుల్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.

Read More