rathd sitaka c

“సేవ” కోసం ఆరాటం…

తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్ధుల వేటలో ఉన్నాయి. ఈ సారి రాష్ట్రంలో అధికారం  కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉండడం, బారత రాష్ట్ర సమితి నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్, బిజెపి వైపు అడుగులు వేయడంతో వివిధ జిల్లాల్లో ఆశావాహుల సంఖ్య అధికామవుతోంది. కాంగ్రెస్, భారాస, బిజెపిలలోని సీనియర్ నేతలు, గత శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఆశించి ఆయా పార్టీల అధినేతల బుజ్జగింపులు, హామీలతో వెనక్కి తగ్గిన నాయకులు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో…

Read More
mega dsc

మెగా”డీఎస్సీ”…

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీలను గుర్తించి దశల వారీగా భర్తీ చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యా శాఖలో ఖాళీగా ఉన్న 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా నోటిఫికేషన్ జారీ చేశారు.

Read More
sanjy on brs

“పొత్తు”అంటే చెప్పుతో కొట్టండి…

బీజేపీ కార్యకర్తలారా, ఇకపై ఎవరైనా బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉంటుందని చెప్పే వాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తాండూరులో కేంద్రమంత్రితో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన సంజయ్ పొత్తుపై మీడియాకు పదే పదే లీకులిచ్చే ఫాల్తు రాజకీయ నాయకులను సైతం చెప్పులతో కొట్టాలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోందన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని…

Read More
jagan rk

“ఆళ్ల”మళ్ళీ…

జగన్ పై కొండంత కోపం, వైకాపా పై చిర్రుబుర్రులు ఆడుతూ షర్మిలా సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ల రామకృష్ణ రెడ్డి తిరిగి గోడకు తగిలిన బంతిలా వైసీపీ గొడుగు కిందకు చేరారు. అనేక రకాల నాటకీయ పరిణామాల మధ్య గత నెలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన తాజాగా జగన్ ని కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే, టిక్కెట్టు ముఖ్యం కాదని, మంగళగిరి స్థానం ముఖ్యమని అక్కడ వైసీపీ ఎవర్ని…

Read More
pv

“Bharat Ratna” PV..

As a distinguished scholar and statesman, Narasimha Rao served India extensively in various capacities. He is equally remembered for the work he did as Chief Minister of Andhra Pradesh, Union Minister, and as a Member of Parliament and Legislative Assembly for many years. His visionary leadership was instrumental in making India economically advanced, laying a…

Read More
pasiyuddin

కాంగ్రెస్ లోకి…

తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి డిప్యూటీ మేయర్ బాధ్యతలు నిర్వర్తించిన భారత రాష్ట్ర సమితి నాయకులు బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్ఎల్ఎ మాగంటి గోపీనాధ్ వేదింపుల వల్లే పార్టీని వీడుతున్నట్టు బాబా కెసిఆర్ కి లేఖ రాశారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.

Read More
IMG 20240205 WA0008

అధినేత్రితో…

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.భేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా సోనియాతో సమావేశమయినట్టు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరినట్టు చెప్పారు. అంశంపై రాష్ట్ర పార్టీ తీర్మానం…

Read More
fmly c

వీధికెక్కిన”రాజ”కుటుంబం..!

“రాయలసీమ”…ఈ గడ్డ ఆది నుంచి కక్షలు, కార్పణ్యాలకు నిలువెత్తు నిదర్శం అని చరిత్ర చెబుతున్న పాఠం. అక్కడ రాజ్యం ఏలిన ఆనాటి రాజుల నుంచి నేడు రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్న అనేక మంది నేతలలో ఆ నైజం స్పష్టంగా కనిపిస్తునే ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో గొడ్డలి వేట్లు, నాటు బాంబులు, రాగి సంకటి అనగానే గుర్తొచ్చేది “సీమ” ప్రాంతాలే. ప్రత్యర్థులను వెతకడం, వేటాడడం,  ఎంత వాస్తవమో, కుటుంబ గౌరవానికి పెద్ద పీట వేయడం అంతే వాస్తవం. కానీ…

Read More
four c

ఆంధ్రాలో ఆ “నలుగురు”..!

ఆంధ్రప్రదేశ్ లో వడివడిగా మారిన రాజకీయ పరిణామాలు నిజంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కొద్ది రోజుల్లో  అక్కడ జరగనున్న ఎన్నికల తంతు రెండు కుటుంబాల చుట్టూనే తిరిగే విచిత్రమైన  పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి రాజకీయ చదరంగంలోకి షర్మిల, పురందేశ్వరి రెండు ప్రధాన జాతీయ పార్టీల పగ్గాలు చేత పట్టు కోవడంతో  ఆంధ్ర రాజకీయాల్లో కొంత కాలం కిందటి  వరకు ఉన్న సమీకరణలు  క్రమేపీ మారుతూ వస్తున్నాయి.  రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు  రెండు కుటుంబాల చేతిలోనే…

Read More
drama trs C

తప్పించుకునే తంటాలు….!

తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.)పార్టీ  తన మనుగడను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్టు కనిపిస్తోంది. బి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలో ఉన్నపుడు వివిధ రంగాల్లో వాటిల్లిన వేల కోట్ల రూపాయల నష్టం, అప్పులు, చెల్లింపులు, అవినీతి కాంట్రాక్టుల నిగ్గుతేల్చి పరిపాలనను గాడిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న కొత్త ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిందుకు అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడలు వేయడం అంతుపట్టకుండా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కెసిఆర్ పదేళ్ళ పాలనలో జరిగిన…

Read More
shrmil babu

“నాన్న, బాబు” జీపులో…

తన కుమారుడు రాజా రెడ్డి పెళ్లికి అనేక  మంది రాజకీయ నాయకులను ఆహ్వానిస్తున్నామని,ఇందులో భాగంగానే చంద్రబాబు కుటుంబాన్నికూడా పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరినట్టు షర్మిల చెప్పారు. తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబు నాయుడుని కాంగ్రెస్ పార్టీ నేత వై.ఎస్. షర్మిల కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వానాన్ని అందజేసి కుటుంబ సమేతంగా  తప్పనిసరిగా రావాలని ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో కొద్దిసేపు చర్చలు జరిపినట్టు అందులో  అధిక సమయం…

Read More
jagansrmil

అక్కడ ఇక రసవత్తరం…!

కొద్ది నెలల్లో జరగనున్న ఆంద్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. వివిధ జిల్లాల్లోని 175 నియోజక వర్గాలకు జరిగే పోరులో ప్రధానంగా ఐదు రాజకీయ పక్షాలు తలపడనున్నాయి. దీని కోసం ఇప్పటి నుంచే ఎత్తులు, పై ఎత్తులు, సమీకరణలకు నడుం బిగించాయి. ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో  రాజకీయ రచ్చబండ వద్ద కొత్త తరహా చర్చలకు తెరలేపింది. జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో అంధ్రలో ఒక్కసారిగా జవసత్వాలు…

Read More
shrmil rahul

రాహుల్ ప్రధాని కావాలి…

రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయమని కాంగ్రెస్ నేత వై.ఎస్. షర్మిల చెప్పారు. వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీని ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి షర్మిలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత అని, ఆయన…

Read More
banana c

రాజకీయాల్లో”అరటి పండ్లు”…!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో “అరటి పండు”పార్టీల ఎత్తుగడలు అంతుపట్టకుండా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న జనసేన, వై.ఎస్.షర్మిల ఆధ్వర్యం లోని వై.ఎస్.ఆర్.తెలంగాణ (వైఎస్ఆర్ టి) పార్టీలు ఎన్నికల సమయంలో వ్యవహరిస్తున్న తీరు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలవ్వగానే తమ బలం ఎంత ఉన్నదనే కనీస విషయాన్ని అంచనా వేసుకోకుండా బరిలోకి దిగడం వెనుక అసలు రహస్యం ఏమిటనే  కోణంలో చర్చలకు తెర లేస్తోంది. తెలంగాణ శాసనసభకు గత నెలలో జరిగిన…

Read More