
దేశంలో మహిళలకు అన్ని రంగాల్లో
33 శాతం రిజర్వేషన్ కావాలని ప్రధాని మోడీని డిమాండ్ చేసే కల్వకుంట్ల కవిత అదే విషయాన్ని అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికలో వాళ్ళ నాన్న కేసీఆర్ కి ఎందుకు చెప్పలేక పోయిందని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబతా లో బి.ఆర్.ఎస్. మహిళలకు స్థానం కల్పించక పోవడం పై కవిత తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 119 స్థానాల్లో 7మంది మహిళలకు టికెట్ ఇచ్చి తెలంగాణ మహిళలను చిన్నచూపు చూసిందని, లిక్కర్ స్కాం నుండి దేశ ప్రజలను పక్క దారి పట్టించేందుకు కవిత 33% మహిళ రిజర్వేషన్ అని ఢిల్లీ లో డ్రామా ఆడి తెలంగాణలో వచ్చే సరికి 3% టిక్కెట్లు ఇస్తూ మహిళలను అవమాన పరచడాన్ని నవత ఖండించారు. కవిత చేసిన ధర్నాలో కూర్చున్న నాయకులంతా కనీసం 10 మంది మహిళలకు మీ సొంత పార్టీ లో టిక్కెట్లు ఇయ్యకుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అందుకే భారాసాకు రాబోయే ఎన్నికల్లో ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు.