updates
IMG 20230822 WA0003

వడివడిగా ప్రక్రియ…

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరు, కేటాయింపుపై అటు సచివాలయం, ఇటు ప్రగతి భవన్ లోనూ జరుగుతున్న కసరత్తు తుది దశకు చేరుకుందని, మరికొన్ని రోజుల్లోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని “ఈగల్ న్యూస్” మొన్ననే చెప్పింది. ఆవ గింజంత సమాచారం అయినా సరే ఫలితం కోసం తాపత్రయ పడుతున్న వారికి ఖచ్చితంగా అది వార్త అవుతుంది. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయడం, పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్…

Read More
IMG 20230822 WA0000

నాన్న దగ్గర ఏమైందో…

దేశంలో మహిళలకు అన్ని రంగాల్లో33 శాతం రిజర్వేషన్  కావాలని ప్రధాని మోడీని డిమాండ్ చేసే కల్వకుంట్ల కవిత అదే విషయాన్ని అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికలో వాళ్ళ నాన్న కేసీఆర్ కి ఎందుకు చెప్పలేక పోయిందని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబతా లో బి.ఆర్.ఎస్. మహిళలకు స్థానం కల్పించక పోవడం పై కవిత తెలంగాణ మహిళలకు  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 119 స్థానాల్లో  7మంది మహిళలకు టికెట్…

Read More
images 26

వీరే మీ అభ్యర్ధులు…

1. కోనేరు కోనప్ప, సిర్పూర్2. బాల్క సుమన్, చెన్నూర్ (SC)3. దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి (SC)4. నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల5. కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ (ఎస్టీ)6. భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్, ఖానాపూర్ (ST)7. జోగు రామన్న, ఆదిలాబాద్8. అనిల్ జాదవ్, బోత్ (ST)9. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్10.  గడ్డిగారి విట్టల్ రెడ్డి, ముధోలే11. ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్12. మహమ్మద్ షకీల్ అమీర్, బోధన్13. హన్మంత్ షిండే, జుక్కల్ (SC)14. పోచారం శ్రీనివాస్…

Read More
IMG 20230821 WA0011

రెండు చోట్ల కేసీఆర్…

రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే గులాబీ దండును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) తరఫున పోటీ చేయనున్న సుమారు 115 మంది అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. వివిధ కారణాల వల్ల నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ నియోజక వర్గాల్లో అభ్యర్థులను పెండింగులో ఉంచారు. ఎక్కువగా సిట్టింగులకే అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కొన్నిచోట్ల పక్కన పెట్టారు. ఆసిఫాబాద్, బోథ్, వైరా, ఉప్పల్, తాండూరు, వేములవాడ, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో సిట్టింగులు గల్లంతు అయ్యారు. ఆయా…

Read More
IMG 20230821 WA0002

“బిచ్చగాళ్లను” నమ్మకండి…

మొన్నటి వరకూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌, సమీకృత వ్యవసాయ మార్కెట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీ, భారాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ అభివృద్ధి సూచికలో రాష్ట్రం మంచి స్థానంలో ఉండటం గర్వకారణం అన్నారు. రూ.100 కోట్లతో ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మించుకున్నామని, ఇంత అద్భుతమైన కలెక్టరేట్లు, పోలీసు…

Read More
20230703 135508

ఇది నిజమైతే…శుభవార్తే…!

హైదరాబాద్ జర్నలిస్టుల చిరకాల ఆశ నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం అందుతోంది. సుమారు మూడు దశాబ్దాలుగా  హైదరాబాద్ లో పనిచేస్తున్న విలేకరులు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి లో సభ్యులకు 2007వ సంవ్సరంలో  అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. నిజాం పేట్ ప్రాంతంలో 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాలు…

Read More
IMG 20230818 WA0012

“హాస్య బ్రహ్మ” ఇంట సందడి….

హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన సినీ నటుడు బ్రహ్మానందం కుమారుడి వివాహానికి సీఎం కెసిఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంత్రులు యర్రబెల్లి దయాకర్, గంగుల కమలాకర్, పలువురు సినప్రముఖులు హాజరయ్యారు.

Read More
images 20

అక్కడ ముమ్మరం…ఇక్కడ నీరసం…

హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రభుత్వ హామీ మేరకు మంజూరు చేయాల్సిన ఇళ్ల స్థలాల విషయంలో జరుగుతున్న జాప్యం విలేకర్లు, జర్నలిస్టు సంఘాలను అసంతృప్తికి గురి చేస్తోంది. డబ్బు చెల్లించి, 16 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న పాత్రికేయులకు, కొత్తగా ఇళ్ల స్థలాల కోసం వేచిచూస్తున్న వారికీ ప్రభుత్వం న్యాయం చేస్తామనే చెబుతోంది. కానీ, ఎప్పుడు అనేది మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు.అయితే, ఇదే విలేకర్ల వర్గానికి జిల్లాల్లో మాత్రం స్థలాలు కేటాయించడం, వారికి మంజూరు చేయడం వేగంగా జరిగి…

Read More
golkonda

“కోట”లో ఏర్పాట్లు….

ఈ నెల 15న చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించనునున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను డిజిపి అంజనీకుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 15న ఉదయం సికింద్రాబాద్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం, ఉదయం11 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేస్తారని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశానికి నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, అడిషనల్…

Read More
Screenshot 2023 08 09 082232

డిల్లీలో ముమ్మరంగా…

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్  సొసైటీకి 2007 వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం  పేట్ బషీరా బాద్ లో కేటాయించిన స్థలాన్ని కాపాడుకోవడానే కార్యక్రమంలో భాగంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళిన  కొందరు సొసైటీకి సభ్యులు అక్కడ రెండు రోజులుగా న్యాయ నిపుణులతో పాటు పలువురు ప్రముఖులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికీ ఆ స్థలాన్ని సొసైటీకి అప్పజెప్పే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూలత కనిపించక పోవడంతో డిల్లీ లోని నిపుణుల అభిప్రాయాలు…

Read More
Screenshot 2023 08 10 100958

రోడ్డు పనులు షురూ…

నగరంలోని ఉప్పల్-నారపల్లి మధ్య ఎలివేటేడ్ క్యారిడార్ లో భాగంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనుల జాప్యం వల్ల అధ్వాన్నంగా మారిన రోడ్ల బాగుచేయడానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. స్థానిక ప్రజా ప్రతినిధులు ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావుని కలిసి వాహనదారులు, పాదచారులు ఎదుర్కొంటున్న సమస్యలు, కొంత కాలంగా ఈ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల గురించి వివరించారు. జాతీయ రహదారి కావడం , రోజు రోజుకీ వాహనాల రద్దీ పెరగడంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే రోడ్ల…

Read More
jnj vh

సున్నితత్వం ముఖ్యం…

రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్ లో అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఇంటి స్థలాల విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదు. ప్రత్యేక తెలంగాణ సాధించుకొని పదేళ్ళు కావస్తున్నా ఆ పోరాటంలో ప్రత్యక్ష సాక్షులు , కలం వీరులైన విలేకరులను ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తోందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. సమాజంలో బాధ్యత కలిగిన నాలుగో వర్గం (ఫోర్త్ ఎస్టేట్)గా ఉన్న జర్నలిజాన్ని , దాని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంత వరకు సమంజసం అనే…

Read More
pet supr

నిర్లక్ష్యం విలువ…ధిక్కరణ మార్గం…

హైదరాబాద్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల విషయంలో ప్రభుత్వం ఏ విషయాన్ని తేల్చక పోవడం సమస్యగా మారుతోంది. ముఖ్యంగా సుప్రీం కోర్టు తీర్పు మేరకు పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమిని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పడంలో అధికారుల నాన్చుడు ధోరణి సొసైటీ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించే సామర్ధ్యం ఉన్న ప్రభుత్వం ఒక్క జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల వ్యవహారంలోనే ఎందుకు స్తబ్దంగా వ్యవహరిస్తోందో అర్ధం…

Read More