Screenshot 2023 07 15 164917

సెలవు దొర..షురూ …

తెలంగాణలో బీఆరెస్ కు వ్యతిరేకంగా బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది. కెసిఆర్ పాలనపై ఐదు సెకన్ల నిడివిగల వీడియోక్లిప్ ని విడుదల చేసింది. సాలు దొర… సెలవు దొర… అంటూ పిట్టల దొర పేరుతో ఈ వీడియో చక్కర్లు కోతుతోంది..

Read More
modi france

ఫ్రాన్స్ లో పోచంపల్లి …

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ అధ్యక్షుడు మెక్రన్ కి ఏనుగు ఆకారంలోని గంధపు చెక్క బొమ్మను అందజేశారు. అదేవిధంగా అయన సతీమణి కి తెలంగాణ పోచంపల్లి సిల్క్ ఇక్కత్ చీరను మోడీ బహుకరించారు.

Read More
swarna 1

దాని కోసమే చేశా..

విశాఖ నగరంలోని ఓ నాయకుని వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను మారిస్తే పది శతం కమీషన్ వస్తుందని మరోకరు చెప్పడంతో నోట్ల మార్పిడి వ్యవహారంలో మోసానికి పాల్పడ్డట్టు విశాఖ హోం గార్డుల ఇన్ స్పెక్టర్ స్వర్ణలత ఒప్పుకున్నారు.నోట్ల మార్పిడి దందాలో ఏ4 నిందితురాలిగా రిమాండ్ లో ఉన్న ఉన్న ఆమెను విచారణ కోసం ఒకరోజు కస్టడి కి తీసుకున్నారు. క్రైమ్ డిసిపి నాగన్న సహా ఎసిపి, ముగ్గురు ఇన్ స్పెక్టర్ లు , మహిళా…

Read More
bonalu

సందడే సందడి…

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 17 తేదీ సోమవారం సెలవుగా నిర్నిణయించారు. ఆ రోజును సాధారణ సెలవుల’కింద జాబితాలో చేర్చారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మహంకాళి దేవిని జరుపుకునే ‘ఆషాడ’ మాసంతో బోనాలు మొదలవుతాయి. భక్తులు, ముఖ్యంగా మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన కుండలలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ప్రతి ఏటా హైదరాబాద్‌లో నెలరోజుల పాటు మూడు దశల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. గోల్కొండ బోనాలు అనంతరం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి…

Read More
konasima bore

బోరు నుంచి మంటలు..

కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద బోరులోంచి గ్యాస్‌, అగ్నికీలలు ఎగసిపడటం కలకలం రేపింది. రాజోలు మండలం శివకోటిలోని ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. ఉదయం నుంచి అగ్నికీలలు, గ్యాస్‌ ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 20 అడుగుల మేర ఈ మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రంగంలోకి దిగింది. మంటలార్పేందుకు అగ్నిమాపక, ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఈ ఘటన జరిగిన ప్రదేశంలో గ్యాస్‌ కోసం గతంలో సెస్మిక్‌…

Read More
sand

నిషేధం…

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాల విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అనేక ప్రాంతాల్లో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై  వచ్చిన ఫిర్యాదులను విచారించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ వీటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.  అక్రమ ఇసుక తవ్వకాలపై గతేడాది మార్చి 23న ఎన్జీటీ నిషేధం విధించింది. దీన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణ జరిపింది. వాదోపవాదాలు విన్న…

Read More
yuham pawan

ఆ “వ్యూహం” ఏంటి…

“వ్యూహం” పేరుతో దర్శకుడు  రాంగోపాల్ వర్మ సినిమా  చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ బయోపిక్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఇప్పటికే జగన్ ని వర్మ రెండు సార్లు కలిసినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే విడుదలైన “వ్యూహం”  టీజర్, మూవీ స్టిల్స్ కాకరేపుతున్నాయి. ఈ  మూవీలో చాలా మంది పొలిటికల్ లీడర్స్ ని వర్మ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో పీఆర్పీ ప్రస్తావన కూడా ఉండే అవకాశం ఉంది. చిరంజీవి, పవన్…

Read More
kavita astralia c

బోనం కోసం…

ఆస్ట్రేలియాలో జరిగే బోనాల పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేరుకున్నారు.బ్రిస్బేన్ నగరంలో ఆమెకు భారత జాగృతి ఆస్ట్రేలియా విభాగం నాయకులు ఘన స్వాగతం పలికారు. సిడ్నీ, మెల్బోర్న్ నగరాల నుండి బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు వచ్చారు. తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు శ్రీకర్ రెడ్డి అందెం, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి, భారత జాగృతి ఆస్ట్రేలియా అధ్యక్షులు కిషోర్, నాయకులు విజయ్ కోరబోయిన, స్వప్న దోమ, విరించి…

Read More
bs chandra

బాధాకరం.

శ్రీ చైతన్య విద్యా సంస్ధల అధినేత బీ.ఎస్ రావు అకాల మరణం అత్యంత బాధాకరమని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో బీ.ఎస్ రావు భౌతిక కాయానికి చంద్రబాబు నాయుడు , లోకేష్, బ్రహ్మిణి విడివిడిగా నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ బీఎస్ రావు మంచి దూరదృష్టి ఉన్న వ్యక్తి అని, సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ శక్తిగా ఎదిగారన్నారు. బీఎస్ రావు దంపతులు…

Read More
Screenshot 2023 07 14 183504

మనం కాదు చైనా..

సాంకేతిక రంగంలో మన దేశం ప్రపంచంలోనే గొప్పదని చెప్పడం పచ్చి అపద్దమని ప్రజాశాంతి పార్టీ నేస కె.ఎ.పాల్ అన్నారు. అన్నిటికంటే గొప్ప దేశం చైనా అని వ్యాఖ్యానించారు. మన దేశంలో అధికారులు, రాజకీయ నాయకుల అవినీతి వల్ల  భ్రష్టు పట్టి పోతున్నామన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు.

Read More
Screenshot 2023 07 14 143645

ఈ సారి పట్టేస్తా “మామా”…

చందమామను అందుకోవాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కల ఆచరణ రూపం దాల్చింది. నిన్న 1.05 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించుకున్న చంద్రయాన్‌-3 ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన మార్క్‌ (ఎల్ వి ఎం 3)ఎం4 వాహక నౌక నింగిలోకి దూసుకుపోయింది. 2019లో చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న పట్టుదలతో శాస్త్రవేత్తలు ఈ  ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టారు. ఇస్రో 2019 జూలై 22న చేపట్టిన చంద్రయాన్‌-2…

Read More
dharna 1

పోరాటం ఆగదు…

జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి  పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల భూమిని సుప్రీం కోర్టు ఆదేశించినా సొసైటీకి స్వాధీనం చేయడంలో అధికారులు, ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 18 వ తేదిన ఇందిరా పార్క్ చౌక్ వద్ద “మహాధర్నా” నిర్వహిస్తున్నట్టు సొసైటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ధర్నా ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ధర్నాలో పాల్గొని మద్దతు ఇవ్వాల్సిందిగా బిఆర్ఎస్…

Read More
parlamant

ఆ బిల్లు లేదు..

ఈనెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 27 బిల్లు ఉభయసభల ముందుకులు రానున్నాయని కేంద్రం తెలిపింది. వీటిలో 21 బిల్లులు కొత్తవి కాగా,  మరో ఆరు బిల్లులు ఇప్పటికే సభలో ప్రవేశపెట్టి స్థాయీ సంఘాలకు ప్రతిపాదించినవి వివరించింది. అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఈ జాబితాలో చేర్చక పోవడం గమనార్హం.

Read More
run

కంగ్రాట్స్ జ్యోతి…

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ మహిళల 100 మీటర్ల హార్డిల్స్ లో ఆంధ్రప్రదేశ్ కు  చెందిన జ్యోతి యర్రాజి చరిత్ర సృష్టించారు. ఈ పోటిలో బంగారు పతకం సాధించన తొలి భారత అథ్లెట్ గా నిలిచారు.  ఎన్నో ఆశలతో మొదటిసారి ఆసియా అథ్లెటిక్స్  బరిలో దిగిన జ్యోతి  అంతర్జాతీయ వేదిక పై అపురూప ప్రదర్శన చేసింది. 23 ఏళ్ల ఈ విశాఖ స్ప్రింటర్ ఫైనల్ పోటిలో 13.09 సెకన్ల లో సాక్ష్యాన్ని చేధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

Read More
bhuvneswri c

అమ్మ వారి సేవలో..

ఆంధ్ర ప్రదేశ్ బిజెపి ఏపీ అధ్యక్షురాలుగా నియమితురలైన దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరి దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేశారు.

Read More