Screenshot 2023 07 27 191517

చికాగో వీదుల్లో…

హైదరాబాద్ నుంచి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన ఓ యువతి నానా ఇబ్బందులు పడుతోంది. ఉన్నత విద్య కోసం వెళ్ళిందా లేక ఉద్యోగం కోసం వెళ్ళిందా అనే విషయం కచ్చితంగా తెలియకున్నా చికాగో నగరంలో ఆమె రోడ్ల పైనే జీవనం సాగిస్తోంది. ఆమె వివరాలు కూడా పూర్తిగా చెప్పలేక్పోతోంది. అయితే, ప్రస్తుతానికి అందుతున్న సమచారాన్ని బట్టి ఆమె నగరంలోని మౌలాలి ప్రాంతానికి చెందిన యువతిగా తెలుస్తోంది. విషయం తెలిసిన ఆమె తల్లి విదేశాంగ మంత్రి జై…

Read Full News
pawan 16

ఆదుకోండి…

తెలంగాణలో వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని జనసేన  అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు.   రాష్ట్రంలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వర్షాలకు తోడు వరద ప్రభావం కూడా భూపాలపల్లి జిల్లాలో పలు గ్రామాలను జల దిగ్బంధం చేసిందని, భూపాలపల్లి జిల్లా, మోరంచపల్లి గ్రామం వరదలో చిక్కుకున్న విషయం నా దృష్టికి వచ్చిందన్నారు. దాదాపు 200 కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయని, ములుగు జిల్లాలోని ముత్యాలధార జలపాతం వద్దకు వెళ్ళిన 40…

Read Full News
amishaa

హైదరాబాద్‌ కు అమిత్ షా…

 బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రత్యేక విమానంలో అమిత్‌ షా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక సంఘాల నాయకులతో భేటీ అవుతారు. సాయంత్రం 5:15 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్‌కు చేరుకొని 8 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో భేటీ…

Read Full News
kavit bhim c

అంబేద్కర్ పేరు పెట్టండి..

నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ భవనంగా నామకరణం చేయాలని, ఆ భవనంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ చేస్తున్న డిమాండ్ కి తెలంగాణ ప్రజల మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన చంద్రశేఖర్ ఆజాద్ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్…

Read Full News
rain 2

జల దిగ్బంధం …

కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు తెలంగాణాలోని పలు జిల్లాలను ముద్ద చేశాయి. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉత్తర ఆంధ్రకు ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, దాని పొరుగు ప్రాంతాల మీద ఉన్న బలమైన అల్పపీడన ప్రాంతం ఇప్పుడు బలహీనపడి దక్షిణ ఒడిశా, దీన్ని ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీద విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధం గా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6…

Read Full News
iit con

ఇలా చేద్దాం..

ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్ధులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఇనిస్టిట్యుట్ అఫ్ టెక్నాలజీ (ఐఐటి), నేషనల్ ఇనిస్టిట్యుట్  టెక్నాలజీ (ఎన్ఐటి)కి చెందిన అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ అధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా  రెండురోజుల పాటు జరిగిన సమావేశాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న 29 ఐఐటిలు, ఎన్ఐటిలకు చెందినా డీన్ లు పాల్గొన్నారు. ఈ  సమావేశాలను ఐఐటి హైదరాబాద్ బ్రాంచి డైరెక్టర్ బి.ఎస్.మూర్తి ప్రారంభించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సమాజ పరిస్థితులకు…

Read Full News
telangana loto

శుక్రవారం కూడా సెలవు..

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు  ఆదేశించారు.

Read Full News
srisailam

నిండుతోంది..

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదలతో శ్రీశైలం జలాశయం నిండు కుండగా మారుతోంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 816.20 చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 215.807 టీఎంసీలగాను 38.1234 టిఎంసిలుగా నమోదయింది.

Read Full News
ANJANI

బీ అలర్ట్ …

రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు.మరో 48 గంటలలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై పోలీస్ కమీషనర్లు, ఎస్.పి.లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్ కూడా పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్ లో…

Read Full News
Screenshot 2023 07 27 120911

పాము అంటే పట్టించుకోరా…

ఇంట్లోకి వచ్చిన పామును పట్టుకోవాలని చేసిన ఫిర్యాదుకు అధికారులు స్పందించ లేదు. ఎంతసేపు వేచి చూసినా వారి జాడ కనిపించలేదు. అలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు నలుగురి సహాయం తీసుకోని పాముని పట్టుకోవడమో, చంపడమో చేస్తారు. కానీ, మహా నగరంలో మాత్రం అలా జరగలేదు. మున్సిపాలిటి అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆ పాముని పట్టుకొని నేరుగా ఆఫీసుకు కెళ్ళాడు ఓ యువకుడు. హైదరాబాద్ అల్వాల్ లో ఈ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి పాము…

Read Full News
roja pc

చంద్రబాబుకు “ఆల్జీమర్స్”..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్జీమర్స్ వ్యాధిగ్రస్తుడిలా తయారై ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్న రోజా మీడియాతో మాట్లాడారు. టిడిపి హయాంలో అప్పటి మంత్రులే గంజాయి సాగుపై బహిరంగంగా మాట్లాడారని, నాటి విషయాలను మరిచిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని విమర్శించారు.సెబ్ వ్యవస్థను తీసుకువచ్చి రాష్ట్రంలో…

Read Full News
godavari 23

బిరబిరా…గలగలా…

భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. గురువారం ఉదయానికి 50.50 అడుగులకు చేరుకుంది. దీంతో 3 వ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. ఇప్పటికే పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాద్రి దేవస్థానం ముందున్న విస్టా కాంప్లెక్స్, అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరింది. గోదావరి ఉధృతిని ముందు నుంచే అంచనా వేస్తున్న…

Read Full News
cs rain c

అప్రమత్తంగా ఉండండి..

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున అత్యంత అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పి లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ రానున్న 48 గంటలలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐ.ఎం.డి…

Read Full News
gadder c

గడ్డర్ కింద కార్మికులు..

తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. ఫ్లె ఓవర్ కు గడ్డర్ ను అమర్చే సమయంలో ప్రమాదం జరిగి ఆప్కాన్స్ సంస్థకు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. జెసిబిలతో విరిగిన గడ్డర్ ను తొలగించి మృత దేహాలను బయటికి తీశారు. మరణిచిన కార్మికులు వెస్ట్ బెంగాల్ కు చెందిన అవిజిత్, మరొకరు బీహార్ కు చెందిన బార్థో మాండల్ గుర్తించారు. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించారు. గడ్డర్ పడిపోవడానికి కారణాలను తెలుసుకుంటున్నారు.

Read Full News