iith c

నైపుణ్యం కోసం మార్పులు…

విద్యార్ధుల్లో  నైపుణ్యాన్ని వెలికి తీయడానికి విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువస్తున్నాట్టు ఐ.ఐ.టి. హైదరాబాద్ సంచాలకులు ప్రొఫెసర్ బి.ఎఎస్. మూర్తి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ విద్యా విధానం మూడేళ్ళ లో గణనీయమైన మార్పు తెచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 29 వ తేదిన జరగనున్న జాతీయ విద్యా విధానం మూడో వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర మనవ వనరుల అభివృద్ధి శాఖ దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐ.ఐ.టి.ల ఉప కులపతులతో  నిర్వహించిన…

Read More

కెనడాలో హత్య…

కెనడాలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, ఒంటారియా ప్రావిన్స్ లో గుర్ విందర్ నాథ్ (24) అనే యువకుడు పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో మిస్సిసాగా అనే ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో గుర్ విందర్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు…

Read More
bus flood

కొంచెంలో తప్పింది..

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒక ప్రైవెట్ ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఒరిస్సా రాష్ట్రం నుండి ఆంద్రప్రదేశ్ కి బయలుదేరింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కల్లేరు గ్రామ పంచాయతీ పరిధిలోని కుయుగూరు – నిమ్మలగూడెం గ్రామాల జాతీయ రహదారిపై వరద నీటిలో చిక్కుకుంది. కుయుగూరు వాగు వరద నీరు రహదారిపై చేరడం, తెల్లవారు జామున 4.30 గంటలకు చీకటిగా ఉండడంతో డ్రైవర్ కి వరద నీరు సరిగా కనిపించ లేదు. దీంతో వరద…

Read More
Screenshot 2023 07 24 161235

భలే అడ్డా..వేస్కో..

పట్ట పగలు…అత్యంత రద్దీ ప్రాంతం… నిత్యం వేల కొద్ది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ట్రాఫిక్ ని అదుపు చేయడానికి పోలీసులు సతమతమయ్యే ప్రదేశం భాగ్యనగరంలోని హైటెక్ సిటీ జంక్షన్. ఆ సెంటర్ ని పోకిరిలు తాగడానికి అడ్డగా మార్చుకున్నారు. ఏ డివైడర్ పక్కనో, గల్లీ లోనో కాదు ఏకంగా పోలీసులు విధులు నిర్వర్తించే ట్రాఫిక్ బూత్ లోనే కావడం గమనార్హం. ఆ బూత్ నే అడ్డాగా మార్చుకొని ఇద్దరూ వ్యక్తులు కూర్చొని మద్యం తాగుతూ బిర్యానీ తింటున్న…

Read More
amit bandi

“షా “తో సంజయ్…

బిజెపి తెలంగాణ శాఖ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని ధిల్లీలో కలిశారు. సంజయ్ అధ్యక్షునిక వైతోలగిన తర్వాత ధిల్లీ వెళ్ళడం రదే మొదటి సారి. అయితే, అమిత్ షా ని మర్యాదపూర్వకంగా కలిసినట్టు సంజయ్ తెలిపారు.

Read More
speaker

మణిపూర్ మంట…

లోక్ సభ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ మంట రాజుకుంది. విపక్షాల నినాదాలు, ప్లకార్డులతో పార్లమెంట్ హాల్ హోరెత్తింది. ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో  సమావేశాల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీనిపై చర్చకు సిద్ధమేనని కేంద్రం ప్రకటించినప్పటికీ ఆ  చర్చకు ముందే ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుపట్టాయి.సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డు లతో దర్శనమిచ్చాయి. “ఇండియా ఫర్ మణిపుర్‌” మణిపుర్‌ పై ప్రధాని ప్రకటన…

Read More
Screenshot 2023 07 24 114251

ఇంతే పడుకుంటా…

అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఫలితంగా జనం నానా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల విషయంలో పడే బాధలు అన్నీ ,ఇన్నీ కావు. గల్లీ గల్లీలో రోడ్ల సమస్య పట్టిపీడిస్తుంది. ఇలాంటి సమస్యతోనే అలసిపోయాడు ఓ వ్యక్తి. రోడ్డు దుర్బర పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి నిరసన తెలియజేయలనుకున్నాడు. అంతే.. నడిరోడ్డుపై కూర్చోలేదు… కానీ పడుకున్నాడు… ఎలా అంటారా…ఏలూరు నగరంలో గంగానమ్మ గుడి వద్ద రహదారిపై నీరు నిలవడంతో ఓ వ్యక్తి వినూత్న నిరసన తెలిపలనుకున్నాడు….

Read More
tomato lorry

తుపాకీ గస్తీ..

అసలే ఆకాశాన్ని అంటిన ధరలతో కొండెక్కి కూర్చున్న టమాటోలకి మార్కెట్ లో ఇంతా, అంతా డిమాండ్ లేదు. కూరలోకి ఒక్క టమాట దొరికిన చాలానే ఆలోచన. అందుకే వాటిని సాగుచేస్తున్న రైతులు దొంగల బెడద నుంచి కాపాడలేక నానా తంటాలు పడుతున్నారు. ఎలాగో పంటను కోసి మార్కెట్ కి చేరవేద్దామంటే రవాణా భయం. వాటిని తీసుకువెళ్తున్న లారీ గమ్య స్థానానికి చేరేంత వరకు రైతుకు గుబులే. మొన్న ఆదిలాబాద్ జిల్లలో ఓ టమాటోల లారీ బోల్తా పడగా…

Read More
cycle c

“బర్త్ డే” సిప్..

ప్రకృతి సిద్ధమైన నీరా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర పురపాలక , ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ పాయింట్ వద్ద కేకును కట్ చేశారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ అనేక ఔషధ గుణాలు కలిగిన నీరా సేవించడం వల్ల కిడ్నీ, క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా…

Read More
Screenshot 2023 07 23 154142

“నయా”గరా…

ములుగు-వాజేడు మండలంలో ఓ ప్రకృతి దృశ్యం వెలుగు చూసింది. అరుణాచలపురానికి కిలోమీటర్ దూరంలో అద్భుత జలపాతం బయటపడింది. ఇంత కాలం సన్నని ధారగా ప్రవహించిన ఈ జలపాతం ఇటీవల కురుస్తున్న వర్షాలకు తన రూపు మార్చుకొని చూడ చక్కని జలపాతంగా మారింది. స్థానికులు దీన్ని గుండం జలపాతంగా పిలుస్తున్నారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ జలపాతం వద్ద నీరు సముద్రపు నీరు మాదిరిగా నీలి రంగులో ఉండడం విశేషం. అందుకే పర్యాటకులు మరి ఆసక్తిగా…

Read More
bus

చెరువులో పడి…

బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వాళ్ళల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. మరో 35 మందికి పైగా గాయపడ్డారు. ఝలకతి సదర్ ఉప జిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలోని చెరువు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాణాలతో బయటపడిన…

Read More
byc

పెట్టుబడికి బ్రేక్…

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరోసారి మోకాళ్ళడ్డింది. ఇప్పటికే నిధులు ఇవ్వక రాష్ట్రాన్ని ఇబ్బందులు కేంద్రం   కేంద్రం తాజాగా  రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.  అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అయిన  బి.వై.డి. హైదరాబాదులో ఏర్పాటు చేయాలనుకున్న వాహన తయారీ విభాగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. బివైడి సంస్థ నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు బ్యాటరీలను కూడా తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి పేరు ఉన్నది. మన దేశంలోనూ బివైడి…

Read More
new cj c

కొత్త న్యాయమూర్తి…

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై అరాధేచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Read More
notes

సినిమా చూపిన ముఠా …

మార్కెట్ లో రోజుకో రూపంలో మోసగాళ్ళు తిరుగుతున్నా అత్యాశపడే వారికి మాత్రం వాళ్ళు కనిపించడంలేదు. “ఒకటికి రెండు” అనే బురుడీ మాటలు చెబుతున్నవారి వలలో చిక్కుకుంటున్నారు. ఆ క్రమంలో నిలువునా మోసపోతున్నారు. నంద్యాలలో సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. ఒకటికి మూడింతలు అంటూ కోట్ల రూపాయలు దోచుకుపోయారు. ఈ వివరాల్లోకి వెళ్తే అసలు నోట్లకు మూడింతలు నకిలీ నోట్లు ఇస్తామని స్థానిక స్థిరాస్తి వ్యాపారి మదన్ మోహన్ రెడ్డి ని ఓ ముఠా నమ్మించింది. తాము ఇదే…

Read More
table

ఆటలూ ముఖ్యం..

విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా , మానసికంగా దృఢత్వం పొందగలుగుతారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. అబిడ్స్ లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో టేబుల్ టెన్నిస్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమాజాభివృద్ధిలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని, విద్యకు ప్రాధాన్యత ఇచ్చే సమాజం అభివృద్ధి చెందుతూనే ఉందని తెలిపారు . లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా…

Read More