అటు”వన్ ఎలక్షన్”.. ఇటు”ఇండియా”…
అటు మోడీ ప్రభుత్వం “వన్ ఇండియా.. వన్ ఎలక్షన్” వైపు పావులు కదుపుతుంటే మరోవైపు విపక్షాల కూటమి “ఇండియా” ముంబైలో సమావేశమై వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ రచనలు చేస్తోంది.
అటు మోడీ ప్రభుత్వం “వన్ ఇండియా.. వన్ ఎలక్షన్” వైపు పావులు కదుపుతుంటే మరోవైపు విపక్షాల కూటమి “ఇండియా” ముంబైలో సమావేశమై వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ రచనలు చేస్తోంది.
గతంలో ఎన్నడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. గత నెలలోనే వర్షా కాల వేశాలు ముగించుకున్న మోడీ ప్రభుత్వం ఒక్కసారిగా తిరిగి సమావేశాలకు సిద్ధపడడం పలు రకాల ఉహాగానాకు తెర లేపుతోంది. కొందరు కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ కోసమని, మరికొందరు జమిలీ ఎన్నికల కోసమని అభిప్రాయ పడుతున్నారు. ఈ రెండు అంశాలు కాకా పార్లమెంటును అంత అత్యవసరంగా సమావేశ పరచాల్సిన అవరసరం ఏముందని…
దేశంలో మహిళలకు అన్ని రంగాల్లో33 శాతం రిజర్వేషన్ కావాలని ప్రధాని మోడీని డిమాండ్ చేసే కల్వకుంట్ల కవిత అదే విషయాన్ని అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికలో వాళ్ళ నాన్న కేసీఆర్ కి ఎందుకు చెప్పలేక పోయిందని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబతా లో బి.ఆర్.ఎస్. మహిళలకు స్థానం కల్పించక పోవడం పై కవిత తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 119 స్థానాల్లో 7మంది మహిళలకు టికెట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రధాన మంత్రి మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సరైన ఆధారాలు లేవని సుప్రీం కోర్టు తేల్చింది. పరువు నష్టం కేసు పై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి గరిష్ఠ శిక్ష విధింపులో ట్రయల్ కోర్టు సరైన కారణం చూపించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. దీంతో రాహుల్ గాంధీకి ఊరట లభించినట్టయింది. దిగువ కోర్టులు అభియోగ పత్రాల సంఖ్య చూశాయే గానీ సరైన కారణాలు చూపలేదని వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ తరఫున వాదనలు…
ప్రారంభం..పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ లో ఛైర్మన్, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభా సభ్యుల నుద్దేశించి ప్రసంగించారు. ఇటీవల మృతి చెందిన సిట్టింగ్ సభ్యులు, మాజీ ఎంపీ లకు ఉభయ సభలు సంతాపం ప్రకటించారు. ఆ వెంటనే లోక్‌సభ ను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఆగస్టు 11…
పి.ఆర్.పి గుర్తుండే ఉంటుంది..అదే ప్రజారాజ్యం పార్టీ ..మెగాస్టార్ కలల సాకారం.. రాష్ట్ర ప్రజలకు ఏదో చేయాలనే సంకల్పం. ఆనాడు ప్రజల్లో ఎన్నో ఆశలు రేపింది. అధికార పక్షానికి తానే పోటీ అని చాటింది. ప్రతీ మీటింగ్ లో అశేష జనవాహినిని చూసి తబ్బిబ్బయింది. గెలుపు ఖాయమని అంచనా వేసింది. కొన్ని సందర్భాల్లో అధికారం మాదే అన్న నిర్ణయానికీ వచ్చింది. కానీ, అది మెగాస్టార్ పై అభిమానమే తప్ప ప్రజలు ఏలికను కోరుకోవడంలేదని ఎన్నికలు జవాబు చెప్పాయి. 2008…