effect copy

“ఈగల్ “ఎఫెక్ట్ ….

తెలంగాణాలో ఎన్నికల అనంతరం అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) వ్యవహార తీరు పై “తగ్గని ఒంటెద్దు దూకుడు…” అనే శీర్షికన “ఈగల్” న్యూస్ పోస్ట్ చేసిన కథనం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశ మైంది. ఎన్నికల్లో ఓటమికి ప్రజలే కారకులు అన్నట్టు బి.ఆర్.ఎస్. నేతలు మాట్లాడడం సమంజసం కాదని “ఈగల్” చేసిన సూచన పై పార్టీ ఉన్నత స్థాయి నేతల్లోనూ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పార్టీ శ్రేణులకు…

Read More
brs meka c

తగ్గని”ఒంటెద్దు”దూకుడు…

తెలంగాణలో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంగా మారిన బి.అర్.ఎస్.పార్టీ నేతలు కొద్ది రోజులుగా  వ్యవహారిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంది. పదేళ్ల పాటు అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి (బి.అర్.ఎస్.) నేతలు గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వంపై మూకుమ్మడిగా చేసున్న పొంతన లేని వ్యాఖ్యలు అంతుపట్టకుండా ఉన్నాయి. తమ ప్రభుత్వ “ఒంటెత్తు” పోకడలు మూలంగానే  గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందనే వాస్తవం తెలిసి కూడా తమ “ఓటమికి ప్రజలే కారణం” అనే రీతిలో బి.అర్.ఎస్….

Read More
brs C

గేరు మార్చిన“సారు”–దారి తప్పిన“కారు”!

తెలంగాణలో మళ్ళీ అధికారం చేపట్టడం ఖాయం.., ఆ తర్వాత ఏకంగా దేశాన్నే ఏల వచ్చు అనే  గంపెడు ఆశలతో మొన్న జరిగిన ఎన్నికల ముందు “ఒంటెత్తు” వ్యూహా రచనలు చేసిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది. తెలంగాణలో దశాబ్ద కాలంగా తిరుగులేని అధికారం చెలాయించిన బి.అర్.ఎస్. పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడడంతో నేతల ఆలోచనలన్నీ కుడితిలో పడ్డ ఎలుకలా మారాయి. ఆరేడు నెలల కిందటి పరిస్థితులు తమకు అనుకూలంగా…

Read More
funds copy

గడి దాటని“దొర”-గల్లంతైన“నిధులు”!

తెలంగాణలో మొన్నటి వరకు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రంతో కొన్నేళ్ళుగా తెగిపోయిన సంబంధాల వల్ల వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంతో సన్నిహితంగా ఉండాల్సిన “ఒంటెద్దు” ప్రభుత్వంలో తానే అన్నీ అన్నట్టు వ్యవహరించి చివరకు రాష్ట్రపతి, ప్రధాని వంటి వారిని సైతం లెక్క చేయకపోవడంతో రాష్ట్రానికి రావలసిన నిధులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజకీయంగా విభేదాలు ఉన్నా పరిపాలన పరంగా చేయాల్సిన పనులను కూడా వ్యక్తిగతంగా…

Read More
landcruser

“కారు”కలలు…!

గత పదేళ్లుగా కుటుంబం పోగేసుకున్న ఆస్తులను చూస్తూ మొన్న జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ ప్రజలు ముడోసారి కూడా తమనే గద్దెనెక్కిస్తారనే అత్యాశ బిఆర్ఎస్ అధినేతల్లో గట్టిగా ఉన్నట్టు తేలిపోయింది. దశాబ్ద కాలం పాటు అధికారం చెలాయిస్తూ, సమర్ధవంతులైన అధికారగణం చుట్టూ ఉన్నా ఎన్నికల పలితాల తీరు తెన్నులను ముందుగానే అంచనా వేయలేక పోవడం “ఒంటెద్దు” ప్రభుత్వ ఓటమికి కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలోనైనా కనీసం ఇంటలిజెన్స్ అధికారుల మాటలు వింటే బాగుండేదనే వాదనలు ఆ పార్టీ…

Read More
whitepaper

ఇంకా తగ్గలే….!

ముఖ్యమంత్రి  హోదాలో ఉన్న వ్యక్తి “ఒంటెద్దు” పోకడగా వ్యవహరిస్తే అతన్ని నమ్ముకున్న ప్రజలకు ఎంత నష్టమో, ఎంత కష్టమో తెలంగాణ జనానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పదేళ్ళ పాటు నగరం నడిబొడ్డున  ప్రగతి భవన్ కేంద్రంగా సాగిన పాలన కేవలం హంగామా మాత్రమే అనే విషయాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. దశాబ్ద పాలనలో అభివృద్ధి ముసుగులో ఆరు లక్షల కోట్ల రూపాయల  అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన మోపారనే సత్యాన్ని…

Read More
images 32

అమ్మో “మమతా”…!

గత పదేళ్లుగా “ఒంటెద్దు సర్కార్”కి భజన బృందంతో వంత పాడింది. ఎవరో ఒక నేతని కొంగున కట్టుకొని కూర్చున్న చోటే రాజ్యం ఏలింది. నమ్ముకున్న నాయకురాలిగా ఉద్యోగుల సమస్యలపై పోరాడాలనే నైతిక నాయకత్వ బాధ్యతను నీ బాంచెన్ అంటూ “ఒంటెద్దు సర్కార్” కాళ్ళ ముందు తాకట్టు పెట్టింది. ఉద్యోగులకు అసలు పోరాడే వీలు లేకుండా అడ్డం పడింది. తన “పలుకు”బడితో భర్త వెంకటేశ్వర్లుని వివిధ హోదాల్లో నియమించుకునే స్థాయికి ఎత్తులు వేసింది. సొంగకర్చే నేత బలంతో పదవీ…

Read More
brs stratgy

ప్రభుత్వంపై“భారాస”కుతంత్రం..?

పదేళ్లుగా ఒంటెద్దు పోకడల ప్రభుత్వంలో పదవుల రుచి చూసిన భారత రాష్ట్ర సమితి నేతలు ఓడిపోయినా ఇంకా మేకపోతు గాభీర్యం ప్రదర్శించడం విమర్శలకు దారి తీస్తోంది. తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో భారాస నేతలు ఆ ప్రభుత్వాన్ని కూలదోస్తామనే ధోరణిలో ఆలోచనలు చేయడాన్ని రాజకీయ పరిశీలకులే కాదు సామాన్య ప్రజలు సైతం ఖండిస్తున్నారు. రాజకీయాల్లో అనుభవం ఉన్న భారాస నేత కడియం శ్రీహరి…

Read More
hatric

“ఒక్కఛాన్స్”పై ఓడిన”ఒంటెద్దు”…!

తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో అనుకున్నదే జరిగింది. ఎవరికైనా, ఏ పార్టీకి అయినా సరే ముడోసారి అధికారం కట్టబెట్టేదే లేదని ఓటర్లు తేల్చి వేశారు. “ఒక్క ఛాన్స్” కోరికకు పట్టం కట్టి, “హ్యాట్రిక్” కలలను కలగానే ఉంచారు. ఒంటెద్దు పోకడల పాలకులను వ్యవసాయ క్షేత్రాలకే పరిమితమయ్యేలా చేశారు. గత నెల ౩౦న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న భారత రాష్ట్ర సమితిని ఇంటికి పంపి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరధం పట్టారు….

Read More
kcr hand c

వెళ్ళిన తీరు..”దుర్యోధన” రీతి..!

తెలంగాణ ప్రజల బలం మూటగట్టుకొని పదేళ్ళ పాటు అధికారాన్ని అనుభవించిన మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చివరికి కృతజ్ఞత లేని వ్యక్తిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని రెండుసార్లు గద్దెనెక్కి కుటుంబం మొత్తం పదవులు అనుభవించిన కెసిఆర్ ఎన్నికల్లో పరాజయం పొందగానే ముడో కంటికి తెలియకుండా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కి పలాయనం చిత్తగించిన తీరును ప్రతీ ఒక్కరు తప్పుపడుతున్నారు. ఎన్నికల్లో…

Read More
surve 1c

ఒంటెద్దు పోకడ-అతి ఆలోచనలు..!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత  మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఉద్యమ పార్టీగా పిలవబడుతున్న బీఆర్‌ఎస్‌కు ఎదురే లేదు, కాంగ్రెస్‌ ఇక రాదు అనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల ముందు ఉన్న పరిస్థితులు పోలింగ్ నాటికి ఒక్కసారిగా తిరగబడ్డాయి. రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు పడుతున్న ప్రజలకు “ఒక్క ఛాన్స్” ఇవ్వడి అంటూ పక్కాగా అమలు చేసే ఆరు రకాల గ్యారంటీ పధకాలతో కాంగ్రెస్ పార్టీ , “హ్యాట్రిక్‌” విజయంపై గట్టి…

Read More
hatric cfy

“హ్యాట్రిక్” వర్సెస్ “వన్ ఛాన్స్”…!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత శాసన సభకు ముడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అత్యంత ఉత్కంటభరితంగా ఉన్న ఈ ఎన్నికల్లో ప్రజలు తమ నాయకులను ఎన్నుకోవడానికి పోలింగ్ కేంద్రాలు సిద్దమైయాయి. ఈ సారి కూడా అధికారం తమదే అవుతుందని అధికార భారత రాష్ట్ర సమితి ధీమాగా ఉంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సైతం ప్రజలు తమకే పట్టం కడతారని కొండంత ఆశతో ఉంది. భారతీయ జనతా పార్టీ  కూడా రాష్ట్రంలో గులాబీ రంగు కాస్తా కషాయంగా…

Read More
money c

రోడ్డుపై”లక్ష్మీ”కళ…!

మేడ్చల్ నియోజక వర్గం పరిధిలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓటర్లకు డబ్బులు పంచుతున్న కొందరిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. పోటీలో ఉన్న ఓ అభ్యర్ధికి చెందిన కళాశాల సిబ్బంది, కొందరు విద్యార్థులు ఈ కాబ్బు పంపకాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వారి వద్ద ఉన్న లిస్టును బట్టి విచారిస్తే మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉందని కాంగెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Read More