Screenshot 20240725 122111 WhatsApp

“రావు” వెడలె ర”సభ”కు..

భారత రాష్ట్ర సమితి అధినేత, శాసన సభ్యులు చంద్రశేఖర్ రావు ఎట్టకేలకు సభలో అడుగు పెట్టారు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత అనారోగ్యానికి గురైన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలకు దూరంగా ఉన్నారు. గత సమావేశాల సమయంలో కోలుకున్నప్పటికీ ఆయన అసెంబ్లీకి రాలేదు. కరెంటు, కాళేశ్వరం, ఇంటిలిజెన్స్ వ్యవహారం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగినా కేసీఆర్ స్పందించలేదు. కానీ, ప్రస్తుత బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేతగా తప్పనిసరి రావలసిన పరిస్థితి ఏర్పడింది….

Read Full News
IMG 20240513 WA0030

“దొర” అడుగు పెట్టరా..?

రాష్ట్ర శాసనసభ సమావేశాలు అంటే ప్రజలకు అనేక ఆశలు ఉంటాయి. అందులో బడ్జెట్ సమావేశాలంటే మహా ప్రత్యేకం. ఈ బడ్జెట్ లో తమకు ఆమోదయోగ్యం కాని కేటాయింపులు, పథకాల పై ప్రశ్నించే గొంతుక కోసం వేచి చూస్తారు. అదే అధికార, ప్రతిపక్షాల మేళవింపు శాసనసభ. బలమైన అధికార పక్షం సభ ముందు ఉంచే అంశాలను అధ్యయనం చేసి తప్పు, ఒప్పులను ఎత్తిచూపాల్సిన నైతిక బాధ్యత ప్రతిపక్షానిది. కానీ తెలంగాణలో జరుగుతున్న తంతు విచిత్రంగా ఉంది. పదేళ్ల పాటు…

Read Full News
Screenshot 20240716 143437 WhatsApp

అంతుపట్టని ఆవేశం

తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులు అనేక ఏళ్లుగా ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తుంటే చేతికి వచ్చే అవకాశాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం నిజంగా దుర్మార్గపు చర్యలే. ఉమ్మడి ఆంధ్రా రాష్ట్రంలో సరైన అవకాశాలు లేక, ఉన్నా ఇబ్బడిముబ్బడిగా ఉన్న పోటీని తట్టుకోలేక తెలంగాణ బిడ్డలు నానా గోస అనుభవించారు. “మా చదువులు మావే అని, మా ఉద్యోగాలు మాకే సొంతం” అంటూ గంపెడు కోరికల మధ్య పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణలో మొన్నటి వరకు వారికి ఎంత…

Read Full News
eye c

పొంచివున్న “రెండు కళ్లు”…!

రాజకీయ చాణక్యం, జగన్ పాలనలో లోపాలను వెలుగెత్తిచాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడు కేంద్రంలోనూ చక్రం తిప్పే స్థితిలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రాలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వైభవం అక్కడ ఒక వెలుగు వెలుగుతోందనడంలో సందేహం లేదు. కానీ, చంద్రబాబు అమితంగా ఇష్టపడే హైదరాబాద్ పై ఆయన మమకారం చెక్కుచెదరనట్టు కనిపిస్తోంది. ఛత్రపతి” సినిమాలో “ఒక్క అడుగు” అనే డైలాగు మాదిరిగా, ముఖ్యమంత్రి హోదాలో…

Read Full News
erravlli ala c

చేరికలా… చొరబాటులా…?

తెలంగాణా ఉద్యమ పార్టీ భారత రాష్ట్ర సమితి (భారాస)లో ఏం జరుగుతోంది? ఆ పార్టీకి చెందిన నేతలు ఎందుకు గోడ దూకుతున్నారు?భారాస గొడుగు నీడ గిట్టడం లేదా లేక ఆ పార్టీ అధినేత ఇస్తున్న భరోసా పై నమ్మకం సన్నగిల్లిందా? కేసీఆర్ నమ్ముకున్న నేతలు పక్కా పార్టీల వైపు ఎందుకు ఎగబాకుతున్నారు? భారాస రాజకీయ వ్యూహంలో భాగంగా ఫిరాయింపులు జరుగుతున్నాయా?  లేక నేతలు ఎవరికి వారు సొంత నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటున్నారా? అసలు ఎర్రవల్లి…

Read Full News
IMG 20240628 WA0047

మరొకరు…

చేవెళ్ల శాసన సభ నియోజక వర్గం నుంచి భారత రాష్ట్ర సమితి తరఫున ఎన్నికైన కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదయ్యను పార్టీలోకి ఆహ్వానించారు.

Read Full News
IMG 20240624 WA0020

భారాస మరో వికెట్..

తెలంగాణాలో భారత రాష్ట్ర సమితికి చెందిన మరో వికెట్ జారీ పోయింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి జగిత్యాల శాసన సభ్యునిగా ఎన్నికైన సంజయ్ కుమార్ అధికార కాంగ్రెస్ లో చేరారు. హైదారాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను కండువా కప్పి పార్టీల్లోకి ఆహ్వానించారు.

Read Full News
kcr kavit c

ఫామ్ హౌస్ లో”కరెంటు”- జైలులో”మత్తు”.!

బుకాయించడంలో ఉద్యమ పార్టీ అధిపతులు ఒకరిని మించి మరొకరుగా ఉన్నారు.  హైదరాబాద్  నుంచి  కోట్ల రూపాయల ఢిల్లీ మద్యం కుంభకోణంలోకి పకడ్బందీగా పావులు కదిపిన కల్వకుంట్ల కవిత తీహార్ జైలు ఊసలు లెక్కబెట్టే వరకు ముడుపులతో ఏ మాత్రం సంబంధమే లేనట్టు మీటింగుల్లోనూ, మీడియా ముందూ బుకయించిన సంగతి అందరికీ తెలిసిందే. డేటా మొత్తాన్ని తొలగించి తనకేమీ తెలియదు అన్నట్టు ఫార్మాట్ చేసిన ఫోన్ లను విచారణ సంస్థల చేతిలో పెట్టిన ఆమె జైలు జీవితం నెలలు…

Read Full News
reviw c

ఇక్కడ”దోపిడీ”-అక్కడ”అరాచకం”..!

తెలుగు రాష్ట్రాల ప్రజలు నిజంగా తెలివైన వారే అని ప్రపంచానికి చాటారు.మాటలు ముఖ్యం కాదు, చేతలు కావాలని తేల్చి చెప్పారు. గత ఏడాది తెలంగాణ ఎన్నికల్లో ఉద్యమ పార్టీని చిత్తుగా ఓడించారు. మొన్న ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో వైసిపిని నామరూపాలు లేకుండా చేశారు. తెలంగాణలో “కారు”ని షెడ్డుకి పంపితే, ఆంధ్రాలో “ఫ్యాన్”గాలి సోకకుండా అదుపు చేశారు. అదే తెలుగు ప్రజల రాజకీయ చైతన్యం. అయితే, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, ఆంధ్రా రాష్ట్రంలో వైసిపి కుదేలు కావడానికి ఒకటే…

Read Full News
brs hiway c

దొడ్డి దారులు – దొంగల ముఠా..!

ఉద్యమ పార్టీ పేరుతో దశాబ్ద కాలం తెలంగాణ పై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి రాష్ర్టంలో రహదారుల అభివృద్ధికి సమాంతరంగా గుట్టు చప్పుడు కాని “దొడ్డి దారులు” కూడా బార్లా తెరిచింది. కవిత నాయకత్వంలో తెలంగాణా నుంచి ఢిల్లీ వరకు ఏకంగా “మద్యం” జాతీయ రహదారిని ఏర్పాటు చేసి, రాష్ట్రంలో అక్రమ వసూళ్ల కోసం కొందరు అవినీతి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను ఎంచుకొని పోలీసులతోనే “దొంగల ముఠా”ను తయారు చేసింది. ఈ ముఠా కోసం…

Read Full News
IMG 20240422 WA0004

“రాజద్రోహ” వ్యూహం..!

ప్రజల సమ్మతి, వారి ఆకాంక్షల మధ్య అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయడం నిజంగా రాజ ద్రోహం కిందికే వస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి భారత రాష్ట్ర సమితి అధినేతలు చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనలు తెలంగాణ ప్రజలను విస్తుపరుస్తున్నాయి. ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరతారని, ఇప్పటికీ 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమతో బేరసారాలు…

Read Full News
dandplaym c

ప్రభుత్వంలో “దండుపాళ్యం”ముఠా…!

గత పదేళ్ళుగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పాలనలో సాగిన తెర వెనుక భాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగు చూడడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. శాసన సభ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన గులాబీ దళం ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఎంతోకొంత లబ్ధి పొందేందుకు నానా తంటాలు పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టే వరకు కాళేశ్వరం, ధరణి వంటి అంశాలలో లోసుగుల వ్యవహారాలు మాత్రమే బయటకు పొక్కాయి. కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు…

Read Full News
IMG 20240331 WA0004

కాంగ్రెస్ లోకి ” కడియం”..

భారత రాష్ట్ర సమితి నేత కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శ్రీహరి సహా అయన కుమార్తె కావ్య కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్నారు.

Read Full News
del jail c

ఢిల్లీ”పీఠాని”కి గురి -“జైలు”తో సరి…!

పదేళ్లుగా తెలంగాణా రాష్ట్రం పై తిరుగులేని అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి మరికొంత కాలంలోనే జాడ లేకుండా పోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పటి మందీ మార్భలాన్ని చూసుకొని ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు ఆయన అనుచరగణం ఏకంగా ఢిల్లీ పీఠం పైనే కన్ను వేసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఉద్యమ పార్టీగా జనంలో నాటుకు పోయిన తెలంగాణా రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ని కాస్తా అనూహ్య రీతిలో భారత రాష్ట్ర సమితి (భారాస)గా…

Read Full News