isha c

Happy B”Devil”

Esha Gupta well known Bollywood actress. Gupta came from national capital Delhi. She has completed Mass Communication course from Manipal Institute of Communications, Karnataka. Esha is a winner of Miss Photogenic title and she was snapped in a stunning swimsuit for the 2010 Kingfisher calendar. Esha wants to acting and modeling.

Read Full News
babu delhi c 1

డిల్లీలో “బాబు”…..!

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఆయనకు డిల్లీ విమానాశ్రయంలో టిడిపి నేతలు కనకమేడల రవీంద్రకుమార్,కేశినేని నాని,రఘురామ కృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు వెళ్ళారు.

Read Full News
ktr gobak

కేటిఆర్ వద్దు..!

గత రెండు ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీకి నిరసనల సెగ తగులుతోంది. బిఆర్ఎస్ బలంగా ఉందనుకున్న జగిత్యాల జిల్లా వెల్గటూర్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో ముగించుకుని తిరిగి వెళుతుండగా పలువురు రైతులు నిరసనకు దిగారు. పాశిగామలో కొందరు రైతులు ప్లకార్డులతో రోడ్డు ఎక్కారు. కేటిఅర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం, ప్రభుత్వానికా, మంత్రికా, మీ ఫామ్ హౌస్కా, కొప్పుల ఈశ్వర్ కా, కటింగ్…

Read Full News
selfi c

జుట్టు కెక్కిన సెల్ఫీ”పిచ్చి”…!

ఆదివారం సాయంత్రం సరదాగా పార్కులో గడపడానికి వచ్చిన అమ్మాయిల మధ్య చోటుచేసుకున్న ఓ చిన్న వివాదం జుట్లు పట్టుకొని కొట్టుకునే స్థాయికి వెళ్లింది. గుంటూరులో ఇటీవలే కొత్తగా ప్రారంభించిన గాంధీ పార్కులో ఈ ఘటన జరిగింది. అక్కడ ఓ లొకేషన్ వద్ద సెల్ఫీలు, రీల్స్ తీసుకునేందుకు యువతులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో చెలరేగిన వివాదం చివరకు కొట్లాటకు దారి తీసింది. కొంతమంది యువతులు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. పలువురు అడ్డుకునే ప్రయత్నం చేసినా పట్టించుకోక పోవడం విశేషం….

Read Full News
revnth gjvl c 1

మేలు మరచిన మామ,అల్లుడు…!

రైతుబందుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా, అల్లుళ్లకు లేదని,హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనమని, ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగడని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దని, పది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ వెంటనే 15 వేల…

Read Full News
electn com 1

రైతు”బంద్”…!

తెలంగాణలో రైతుబందు పధకం అమలుకు మూడు రోజుల కిందట అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. వాస్తవానికి మంగళ వారం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బు జమకావలసి ఉంది.అయితే, ఈ నెల 28న రైతుబంధు పంపిణీ చేస్తారని బిఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన పత్రికా ప్రకటనలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల నిబంధనలను ఉల్లఘిన్చినందుకు రైతుబందుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.

Read Full News
rahul priya

కెసిఆర్ చదివిన స్కూలు మేము కట్టిందే…!

తెలంగాణను ప్రతేక రాష్ట్రంగా చేసి, ఇక్కడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీయే అని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్పారు. కెసిఆర్ చదువుకున్న స్కూలుని కట్టించిది కుడా కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పదేపదే అడుగుతున్న ప్రశ్నకు ఇదే నా సమాధానం అన్నారు.  తెలంగాణ ముసుగులో బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా ప్రజలను నిలువు దోపిడీ చేసిందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు…

Read Full News
chadalavd 1

మరో 11 పాలిటెక్నిక్ కాలేజీలు…

ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు నెలల్లో మరో 11 పాలిటెక్నిక్ లకు ఎన్‌బీఏ లభించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. నేషనల్ బోర్డు ఆప్ అక్రిడిటేషన్ గుర్తింపు సాధనలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ లకు నూతనత్వాన్ని ఆపాదిస్తున్నాయన్నారు. విద్యార్ధులకు ఉపాధి ఏ మేరకు లభిస్తుందన్న దానిని కూడా ఎన్‌బీఏ పరిగణనలోకి తీసుకుంటుదని, ఆక్రమంలో వారికి తక్షణం ఉద్యోగాలు లభించేలా చర్యలు…

Read Full News
IMG 20231126 WA0021

తిరుపతిలో మోడీ…

తిరుపతి ప్రధాని నరేంద్ర మోదీ ఆంద్రప్రదేశ్ పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికారు.

Read Full News
yuvac

మళ్లీ జన”గళం’….!

ఆంధ్రప్రదేశ్ లో  ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ జనగళమే “యువగళం”గా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 79రోజుల సుదీర్ఘ విరామానంతరం మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతోంది. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలన, అవినీతి బాగోతాన్ని ఎండగడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నైపుణ్య అభివృద్ధి కేసులో  జైలుకు  వెళ్ళడంతో అనివార్య పరిస్థితుల్లో సెప్టెంబర్ 9వ తేదీన కోనసీమలోని రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద యువనేత లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. తర్వాత దేశ రాజధాని డిల్లీలో జగన్మోహన్…

Read Full News
priyanka mdr c

బాధలు తెలియని బీఆర్‌ఎస్‌…

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోలేద కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజల సొమ్ము దోచుకున్నారని, ఆరోపించారు. శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. పేపర్‌ లీకులు జరుగుతుంటే పిల్లల తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉందన్నారు.  బిడ్డల భవిష్యత్‌ పై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందా అని ప్రజలను ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతలకు వందల…

Read Full News
modi kamrdy

బిఆర్ఎస్ గద్దె దిగడం ఖాయం…

వచ్చే నెల 3వ తేదీన తెలంగాణలో ప్రజలు బిఆర్ఎస్ పార్టీని గద్దె దించుతారనే నమ్మకం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల్లో ఎన్నోఆశలు కన్పిస్తున్నాయని వాటిని నెరవేర్చుకోవడానికి మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గాలి వస్తుందన్నారు. శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. దేశంలో  7 దశబ్దాలు పాలించిన  కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎమి చేయాలేదని అదేవిధంగా పదేళ్లుగా రాష్ట్రంలో…

Read Full News
money 5

“ఓటు” కోసం “నోటు”నై వస్తున్నా…..!

తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కట్టల కొద్ది డబ్బు చేతులు మారుతున్నాట్టు తెలుస్తోంది. వివిధ మార్గాల్లో ఆయా నియోజక వర్గాలకు కోట్ల రూపాయలు తరలిపోతున్నట్టు సమాచారం అందుతోంది. పోలీసులు, ఎన్నికల అధికారులు, కేంద్ర బలగాల సమక్షంలో అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా చెక్ పోస్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినప్పటికీ నగదు ప్రవాహం మాత్రం ఆగడం లేదని ఇటీవల జరిగిన సంఘటనలే ఉదాహరిస్తున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే చెక్…

Read Full News
kavita chai

ఛాయ్..బిస్కెట్…

శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో పలు సమావేశాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీ షాప్ వద్ద సందడి చేశారు. నిజామాబాద్ లోని గల సవేరా హోటల్ లో టీ తాగుతూ ఆమె అక్కడ ఉన్న జనాలతో కాసేపు ముచ్చటించారు. యువకులతో సెల్ఫీలు దిగారు.అకస్మాత్తుగా కవిత గారు తమ హోటల్ ను సందర్శించడం పట్ల యాజమాని, సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.

Read Full News