kcr
ఒంటెద్దు పోకడ-అతి ఆలోచనలు..!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఉద్యమ పార్టీగా పిలవబడుతున్న బీఆర్‌ఎస్‌కు ఎదురే లేదు, కాంగ్రెస్ ఇక రాదు అనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల ముందు ఉన్న పరిస్థితులు పోలింగ్ నాటికి ఒక్కసారిగా తిరగబడ్డాయి. రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు పడుతున్న ప్రజలకు “ఒక్క ఛాన్స్” ఇవ్వడి అంటూ పక్కాగా అమలు చేసే ఆరు రకాల గ్యారంటీ పధకాలతో కాంగ్రెస్ పార్టీ , “హ్యాట్రిక్” విజయంపై గట్టి…
మేలు మరచిన మామ,అల్లుడు…!
రైతుబందుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా, అల్లుళ్లకు లేదని,హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనమని, ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగడని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దని, పది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ వెంటనే 15 వేల…
కెసిఆర్ చదివిన స్కూలు మేము కట్టిందే…!
తెలంగాణను ప్రతేక రాష్ట్రంగా చేసి, ఇక్కడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీయే అని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్పారు. కెసిఆర్ చదువుకున్న స్కూలుని కట్టించిది కుడా కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పదేపదే అడుగుతున్న ప్రశ్నకు ఇదే నా సమాధానం అన్నారు. తెలంగాణ ముసుగులో బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా ప్రజలను నిలువు దోపిడీ చేసిందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు…
“బక్కోడు..గుండోడు..నీ అయ్యా..”! ఇదే తీరు…
తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నాకొద్దీ వివిధ రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధానంగా బిఆరేస్, కాంగ్రెస్, బిజెపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ఇంత వరకు ఎన్నడూ లేని విధంగా ప్రచార తీరు గాడి తప్పుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికల ప్రచార సభల్లో నేతల ప్రసంగాల తీరును పరిశీలిస్తే రాజకీయాల కంటే వ్యక్తి గత విమర్శలు, దూషణలకు దిగుతున్నట్టు స్పష్టం అవుతోంది. ఏ ఎన్నికల్లోనైనా సరే అధికార పార్టీ పై విపక్షాలు,…
‘‘యూజ్ లెస్ ఫెలో”….
‘‘యూజ్ లెస్ ఫెలో… ఉద్యోగాలు ఎందుకివ్వడం లేదని నిరుద్యోగులు నిరసన తెలిపితే సముదాయిం చాాల్సింది పోయి తిడతావా? దవడ పళ్లు రాలకొడితే సరి… కండకావరమెక్కి మాట్లాడుతున్నవ్. ఒక్కసారి మడతల చొక్కా.. అరిగిన రబ్బర్ చెప్పులేసుకున్న నీ గతాన్ని గుర్తు చేసుకో’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో కేటీఆర్ పై ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గం గంగాధరలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాటాడుతూ బిఆర్ఎస్, కాంగ్రెస్…
“డ్రంక్ & డ్రైవ్ టెస్ట్”కి సిద్ధమా..!
కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించి, పొలిమేరలకు తరమాలని గజ్వేల్ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీరు పాతాళానికి తోక్కుతారని తెలిసే కెసిఆర్ కామారెడ్డికి పారిపోయిండని, కామారెడ్డికే కాదు కన్యాకుమారికి పారిపోయిన ప్రజలు కేసీఆర్ ను ఓడించి తీరతారన్నారు. గజ్వేల్ లో జరిగిన ఎన్నికల సభలో రేవంత్ మాట్లాడుతూ రైతుల మేలుకంటే కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకపోయేందుకే ప్రాధాన్యతనిచ్చాడని విమర్శించారు. రైతుల వడ్లు కొనని కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ లో పండిన…
25న ధూం..ధాం…సభ…
భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 25 వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో ఎన్నికల భారీ బహిరంగ సభ ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహణ ఏర్పాట్లపై పర్యవేక్షణ జరిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బహిరంగ సభ కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్య అతిధిగా హాజరవుతారని చెప్పారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల కు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ…
రెండు లక్షల ఉద్యోగాలు గ్యారంటీ..
కెసిఆర్ ప్రభుత్వ హయంలో నిరుద్యోగుల హత్మహత్యలు పెరిగాయని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే వెంటనే యువతకు రెండు లక్షల ఉద్యోగాలు తప్పనిసరి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. పదేళ్ళ పాలనలో తెలంగాణ కెసిఆర్ చేతిలో నిలువుదోపిడికి గురైందని, భారత రాష్ట్ర సమితి అవినీతిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. కెసిఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్యలు తీరలేదన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కుమురం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ ఎన్నికల సభల్లో ప్రియాంక పాల్గొన్నారు. తెలంగాణలో…
తండ్రీ, కొడుకుల అబద్ధాలు….
ఎన్నికల ప్రచారంలో కేసీఆర్,కేటీఆర్ ,హరిష్ రావు లు ఓటమి భయం తో అబద్దాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు బంధు ఆపాలని నేను గానీ, కాంగ్రెస్ నేతలు కూడా ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. గత నెలలో రైతు బంధు ,దళిత బంధు ,బీసీ బంధు ,రుణమాఫీ లు నామినేషన్ ప్రక్రియ కంటే ముందే విడుదల చేయాలని డిమాండ్ చేసినట్టు గుర్తు చేశారు.రైతుబంధు ఆపాలని కాదని, దాన్ని మరింతగా పెంచాలని డిమాండ్…
భారాసలోకి బాల కిషన్ …
కొడంగల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అనంతరం ఉపసంహరించుకున్న బాలకిషన్ యాదవ్ పట్నం మహేందర్ రెడ్డి అధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.కేటీఆర్ బాలకిషన్ యాదవ్ కు గులాబి కందువ కప్పి స్వాగతం పలికారు. దుద్యాల మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన బాలకిషన్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను కొడంగల్ ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని, అయితే సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధి కొడంగల్ లో ప్రజల…
రెండు చోట్లా ఒకేరోజు…
రాష్ట్రంలోని రెండు శాసన సభ నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు 9వ తేదిన నామినేషన్ దాఖలు చేయనున్నారు. గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ దాఖలు వేస్తారు. ఉదయం 10:45 గంటలకు ఎరవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10:55 కు గజ్వేల్ టౌన్ లోని సమీకృత పభుత్వ కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య…
“పేట”లో కెసిఆర్…
శాసన సభ ఎన్నికల ప్రచార కార్యక్రంలో భాగంగా నారాయణ పేటలో ఏర్పాటు చేసిన సభలో బిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు.
సాంకేతిక లోపం…
ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటన లో భాగంగా దేవకద్ర నియోజక వర్గానికి వాయు మార్గాన బయలు దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్ తిరిగి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి మళ్లించి సురక్షితంగా లాండింగ్ చేశారు. ఏవియేషన్ సంస్థ మరో ప్రత్యామ్యాయ హెలికాప్టర్ ను ఏర్పాటుచేయడంతో దేవకద్ర ప్రచారానికి వెళ్లారు.
“మేడి”పాపం కేసీఅర్ దే…
కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని, కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమే అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం పై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ బ్యారేజి ద్వారా లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారన్నారు. నాణ్యత లోపం వల్ల మెడిగడ్డ ప్రమాదం జరిగిందనీ, కేంద్ర హోంమంత్రి, గవర్నర్ ,ఎన్నికల కమిషన్ మేడిగడ్డ పై విచారణకి ఆదేశించాలనీ డిమాండ్…
