sharmila c1

“చెయ్యి”ఎత్తిన షర్మిలా…!

కేసీఆర్ మీద ప్రజలకు తారా స్థాయిలో వ్యతిరేకత ఉందని, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేక ఓటును చీల్చొద్దనే ఒకే ఒక్క ఆలోచనతో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోందని ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశం ఉందని, మళ్లీ కేసీఆర్ కు అవకాశం ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేసినట్టు ఆమె తెలిపారు. ఈ విషయంలో లోతుగా పరిశీలించిన తర్వాతే రాబోయే ఎన్నికల్లో…

Read More
IMG 20231027 WA00081

సొంత గూటికి….

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బిజెపిలో చేరిన రెడ్డి తాజాగా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఢిల్లీ లోని ఎ.ఐ.సి.సి. కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు మాణిక్ రావు ఠాక్రే రాజ గోపాల్ కి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

Read More
journ sridher

మేనిఫెస్టోలో”కలం”వీరులు..!

దశాబ్దాలుగా అపరీష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించడానికి వీలుగా రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రూపొందించే మేనిఫెస్టో లో వాటిని చేర్చాలని తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక కోరింది. ఈ మేరకు తెలంగాణా కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఛైర్మెన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబుని వేదిక ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసింది. తెలంగాణ జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమానికి సంబంధించి 9 ప్రధాన అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. తమ దీర్ఘకాలిక సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి వాటి…

Read More
rahul tea c

“దొర”ల పాలన వద్దు.…

తెలంగాణలో ప్రజల రాజ్యం నడవాలని పదేళ్ళ కిందట  సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, కానీ అది ఈనాడు దొరల చేతుల్లోకి వెళ్లిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కోరుకుందీ, ఆశించింది దొరల తెలంగాణ కాదు, ప్రజల తెలంగాణ అని పేర్కొన్నారు. “దొరల తెలంగాణ కు, ప్రజల తెలంగాణకు” మధ్య కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. ఆర్మూరులో జరిగిన విజయభేరీ తొలి విడత బస్ యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ…

Read More
wgl rahul

కాంగ్రెస్ గెలుపు ఖాయం…

రాష్ట్రంలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని,  దొరల తెలంగాణ-ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని  కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. వరంగల్ బస్సు యాత్రలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించాం, కానీ,  రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని పేర్కొన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికలలో బిఆర్ఎస్, కేసీఆర్ ఓటమి ఖాయమనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందనీ, బీఆర్‍ఎస్ అవినీతితో ప్రజలు…

Read More
rahul priyanka 1

రామప్పలో రాహుల్…

తెలంగాణా ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వరంగల్ జిల్లా లోని రామప్ప ఆలయంలో పూజలు చేశారు. దేవాలయంలో పూజల అనంతరం వారిద్దరూ ములుగులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాహుల్, ప్రియాంక వెంట తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పలువురు నేతలు ఉన్నారు.

Read More
IMG 20231015 WA0034

మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు..

జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ విషయాన్ని శ్రీధర్‌బాబు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీకి నివేదిస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ (డీజేహెచ్‌ఎస్‌) అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు జి.ప్రతాప్‌రెడ్డి, దండ రామకృష్ణ, సభ్యులు క్రాంతి తదితరులు ఆదివారం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల…

Read More
Screenshot 20231014 161826 WhatsApp

సిగ్గుండాలి….

నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి, పదవులు, అధికారం అనుభవించి నేడు అదే పార్టీని వీడి పోవడం సిగ్గుచేటు వ్యవహారమని పి.సి.సి. అధ్యక్షులు రేవంత్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య పై విరుసుకు పడ్డారు.

Read More
batti c

ప్రజల”చేయి”వదలని “విక్రమార్క”…

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకే కాదు, సామాన్య ప్రజలకు సైతం అందరికి తెలిసిన నేత మల్లు భట్టి విక్రమార్క. ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన రాజకీయ నేపద్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర స్థాయి నేతగా ప్రజలకు చేరువయ్యారు. కాంగ్రెస్ నేతలు, లోక్ సభ మాజీ సభ్యులు స్వర్గీయ మల్లు అనంత రాములు, మరో పార్లమెంటు సభ్యుడు మాజీ శాసన సభ మాజీ సభ్యులు మల్లు రవి సొంత తమ్ముడు విక్రమర్క. 1990వ దశకంలో…

Read More
images 34

గుడ్ బై…”కారు”పై మోజు…!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.అయన రాజీనామ లేఖను ఎ.ఐ.సి.సి. అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కు పంపినట్టు సమచారం అందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు అయన గులాబీ కండువాతో “కారు” ఎక్కే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read More
sharmila sonia rahul

ఎలా…!

ఎన్నో ఆశలతో తెలంగాణ ఆడపడుచు అంటూ రాజకీయ చట్రంలో దిగిన వై.ఎస్.షర్మిల సారథ్యంలోని వై.ఎస్.అర్. తెలంగాణ పార్టీ భవితవ్యం ఎటూ తేలకుండా ఉంది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో అంటకగుతున్న షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తన పార్టీ షరతులను ఢిల్లీ పెద్దల చెవిన వేసి ఈ నెల 30వ తేదీని విలీన వ్యవహారానికి తుది గడువు విధించింది. గతంలో ఆమె పాలేరు సీటుని ఆశించింది. ఖమ్మం జిల్లాలో…

Read More
Screenshot 20230925 164239 WhatsApp

హైదరాబాద్ సే కరో…

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎం.ఐ.ఎం. నేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో రాహుల్ గాంధీకి దమ్ముంటే వాయనాడ్ నియోజకవర్గం నుంచి కాకుండా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని వ్యాఖ్యానించారు.

Read More
Screenshot 20230921 112504 Instagram

దేనికైనా రెడీ…

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూలీగా మారారు. కార్మికుల సమస్యలు తెలుసుకునే క్రమంలో ఎర్ర రంగు చొక్కా ధరించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో ఈ కార్యక్రమం జరిగింది. రాహుల్ లగేజ్ మోస్తూ సందడి చేశారు.

Read More
3 party

“మార్పు” ముంచొచ్చు..!

వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలులోకి వస్తే తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు భారీ కసరత్తు చేయాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. దాదాపు 35 స్థానాలకు పైగా మహిళల చేతుల్లోకి వెళ్ళాక తప్పదు. మహిళా జనాభా ఆధారంగా చేసుకొని నియోజక వర్గాల కేటాయింపులు జరిగే అవకశాలున్నాయనే సమచారం అందుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి (బి. అర్.ఎస్.) మళ్ళీ కొత్త జాబితాను తయారు చేయాలి, సరైన మహిళా అభ్యర్ధులను…

Read More
cong sitadayakar

కాంగ్రెస్ లోకి..

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు.రేవంత్ రెడ్డి నివాసానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆమె రేవంత్ తో సమావేశం అయ్యారు. మరి కొద్ది రోజుల్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.

Read More