summer

నెల ముందే…

తెలుగు రాష్ట్రాలలో అప్పుడే భానుడి ప్రతాపం చుర్రు మంటోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సారి ఎండలు ముందే రానున్నాయి అని, గత ఏడాది కంటే కూడా ఎండల ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, వాతావరణ శాఖ ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోమంటూ కొన్ని హెచ్చరికలను జారీ చేసింది. ఈ ఏడాది ఎండలు “బాబోయ్”…

Read More
balka c

అధికారం లేక అసహనం…!

అధికారంలో ఉన్నప్పుడు “ఒంటెద్దు” పోకడలో పాలన చేసి, విపాక్ష పార్టీలు, వాటి నేతల పై అడ్డూఅదుపు లేకుండ మాట్లాడిన భారత రాష్ట్ర సమితి నేతల్లో ఇంకా ఆ బిరుసు తగ్గ లేదు. పదేళ్లుగా నియోజక వర్గాలను ఏకపక్షంగా ఏలిన బి.అర్.ఎస్. నేతలలో రెండు నెలలుగా ఏ అధికారం లేక అసహనం పెరిగిపోతోందనే బలమైన విమర్శలు వస్తున్నాయి. సుమారు 45 రోజులుగా ఆ పార్టీ క్రియాశీలక అధ్యక్షులు కెటిఆర్, ఎమ్మెల్సీ కవిత, కడియం శ్రీహరి వంటి నేతలు అధికార…

Read More
revnth phida

ఏం మాట్లాడిండ్రా భై…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగ తీరు జనం మధ్య అత్యంత హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జరిపిన ఆదిలాబాద్ జిల్లా పర్యటన తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. వేదిక నుంచి అయన గుప్పించిన మాటలు చర్చనీయాంశాలుగా మారాయి .రాష్త్ర పెద్దగా రేవంత్ వ్యవహార శైలి, లేవనెత్తిన అంశాలు, వెల్లడించిన హామీలు భవిష్యత్తును కళ్ళముందు చూపినట్టు ఉందనే ప్రశంసలు వెల్లువెత్తడం విశేషం. ఇంద్రవెల్లిలో…

Read More
fmly c

వీధికెక్కిన”రాజ”కుటుంబం..!

“రాయలసీమ”…ఈ గడ్డ ఆది నుంచి కక్షలు, కార్పణ్యాలకు నిలువెత్తు నిదర్శం అని చరిత్ర చెబుతున్న పాఠం. అక్కడ రాజ్యం ఏలిన ఆనాటి రాజుల నుంచి నేడు రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్న అనేక మంది నేతలలో ఆ నైజం స్పష్టంగా కనిపిస్తునే ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో గొడ్డలి వేట్లు, నాటు బాంబులు, రాగి సంకటి అనగానే గుర్తొచ్చేది “సీమ” ప్రాంతాలే. ప్రత్యర్థులను వెతకడం, వేటాడడం,  ఎంత వాస్తవమో, కుటుంబ గౌరవానికి పెద్ద పీట వేయడం అంతే వాస్తవం. కానీ…

Read More
fmly p

“జననేత”గా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన దివంగత రాజశేఖర్ రెడ్డి బిడ్డల పంతాలు, పట్టింపులు రోడ్డుకెక్కిన తీరుపై “ఈగల్ న్యూస్” అందిస్తున్న ప్రత్యేక కథనం…త్వరలో…మీ కోసం …

Read More
what is c

“ప్రొఫెసర్”ఉద్యమ నేత.. మరి”సంతోష్”..!

తెలంగాణలో బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షం విధి ,విధానాలను విస్మరిస్తున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ళ పాటు అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నేతలు మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ ఇంకా అధికారంలోనే ఉన్నట్టు, తమ మాటలే సాగలన్నట్టు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. కొత్తగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సుమారు నెల రోజులుగా బిఆర్ఎస్ నేతలు పొంతన లేని విమర్శలు, ఆరోపణలు చేయడం అంతుపట్టకుండా ఉందని రాజకీయ పరిశీలకులు, కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అంతేకాక, ప్రభుత్వం…

Read More
four c

ఆంధ్రాలో ఆ “నలుగురు”..!

ఆంధ్రప్రదేశ్ లో వడివడిగా మారిన రాజకీయ పరిణామాలు నిజంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కొద్ది రోజుల్లో  అక్కడ జరగనున్న ఎన్నికల తంతు రెండు కుటుంబాల చుట్టూనే తిరిగే విచిత్రమైన  పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి రాజకీయ చదరంగంలోకి షర్మిల, పురందేశ్వరి రెండు ప్రధాన జాతీయ పార్టీల పగ్గాలు చేత పట్టు కోవడంతో  ఆంధ్ర రాజకీయాల్లో కొంత కాలం కిందటి  వరకు ఉన్న సమీకరణలు  క్రమేపీ మారుతూ వస్తున్నాయి.  రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు  రెండు కుటుంబాల చేతిలోనే…

Read More
drama trs C

తప్పించుకునే తంటాలు….!

తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.)పార్టీ  తన మనుగడను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్టు కనిపిస్తోంది. బి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలో ఉన్నపుడు వివిధ రంగాల్లో వాటిల్లిన వేల కోట్ల రూపాయల నష్టం, అప్పులు, చెల్లింపులు, అవినీతి కాంట్రాక్టుల నిగ్గుతేల్చి పరిపాలనను గాడిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న కొత్త ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిందుకు అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడలు వేయడం అంతుపట్టకుండా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కెసిఆర్ పదేళ్ళ పాలనలో జరిగిన…

Read More
nursing dd c copy

“ఆకలి” తీరని అధికారులు…!

తెలంగాణ వైద్య విద్య శాఖ పరిధిలోని నర్సింగ్ విభాగంలో ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారడం లేదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, ఒంటెత్తు పోకడల వల్ల సుమారు పదేళ్లుగా ఈ విభాగంలోని అధికారులు, సిబ్బందిదే ఇష్టారాజ్యంగా ఉంది. ఎనిమిది ఏళ్లకు పైగా ఒకే హోదాలో తిష్ట వేసుకుని కూర్చున్న అధికారుల వల్ల అనేక సమస్యల ఎదురవుతున్నాయని వివిధ ఆసుపత్రుల నర్సులు, నర్సింగ్ కాలేజీల్లోని బోధనా సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల తర్వాత వైద్య విద్యా…

Read More
effect copy

“ఈగల్ “ఎఫెక్ట్ ….

తెలంగాణాలో ఎన్నికల అనంతరం అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) వ్యవహార తీరు పై “తగ్గని ఒంటెద్దు దూకుడు…” అనే శీర్షికన “ఈగల్” న్యూస్ పోస్ట్ చేసిన కథనం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశ మైంది. ఎన్నికల్లో ఓటమికి ప్రజలే కారకులు అన్నట్టు బి.ఆర్.ఎస్. నేతలు మాట్లాడడం సమంజసం కాదని “ఈగల్” చేసిన సూచన పై పార్టీ ఉన్నత స్థాయి నేతల్లోనూ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పార్టీ శ్రేణులకు…

Read More
brs meka c

తగ్గని”ఒంటెద్దు”దూకుడు…

తెలంగాణలో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంగా మారిన బి.అర్.ఎస్.పార్టీ నేతలు కొద్ది రోజులుగా  వ్యవహారిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంది. పదేళ్ల పాటు అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి (బి.అర్.ఎస్.) నేతలు గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వంపై మూకుమ్మడిగా చేసున్న పొంతన లేని వ్యాఖ్యలు అంతుపట్టకుండా ఉన్నాయి. తమ ప్రభుత్వ “ఒంటెత్తు” పోకడలు మూలంగానే  గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందనే వాస్తవం తెలిసి కూడా తమ “ఓటమికి ప్రజలే కారణం” అనే రీతిలో బి.అర్.ఎస్….

Read More
jyoth cf

“దీపం” వెనుక “చీకటి”ఎంత..?

తెలంగాణ ఉద్యమంలో అమరులైన త్యాగదనులకు నివాళిగా ఉద్యమ పార్టీ బిఆర్ఎస్  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన అమరవీరుల స్మారక కేంద్రం “అమరజ్యోతి” నిర్మాణ వ్యయంపై క్రమంగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి.  ఉద్యమ స్ఫూర్తి ఉట్టిపడేలా, చూడగానే అమరులను స్మరించుకునేలా సకల హంగులతో నగరం నడిబొడ్డున తళుకులీనుతున్న అమరజ్యోతి నిజంగా తెలంగాణకు గర్వకారణమని చెప్పడంలో సందేహం లేదు. దాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పం కలిగినందుకు అప్పటి ప్రభుత్వాన్ని కొనియడక తప్పదు. అమరజ్యోతి కేంద్రాన్ని అద్భుతంగా రూపకల్పన చేసినందుకు అధికార యంత్రాంగాన్ని సైతం…

Read More
kobra

కాటేస్తున్న”కోబ్రా”…!

“కోబ్రా” పేరు వింటేనే ఒళ్ళు జలతరిస్తుంది.ఎందుకంటే అది ఒక ఆఫ్రికా ఖండంలో కనిపించే భయకరమైన సర్పం.అది కాటు వేస్తే కాటికి వెళ్ళవలసిందే.అది సర్పాలకు రారాజు. కాలకూట విషాన్ని చిమ్మే విషసర్పం. బయో ఉత్పత్తులను తయారు చేసే దేవగాన్ కంపెనీ “కోబ్రా” బ్రాండ్ పేరుతో ఒక బయో ఉత్పత్తిని తయారు చేసి మార్కెట్ లోకి వదిలిందే ఆ కోబ్రా…కౌలురైతును కాటు వేసింది.ఆ దెబ్బతో రైతు అప్పులు పాలైయాడు. రాజులాగా బ్రతకలసిన ఓ కౌలురైతు ప్రైవేటు వెహికిల్ కు డ్రైవర్…

Read More
nusing cf copy

నిర్లక్ష్యం నీడలో “నైటింగెల్స్”…

ఆరోగ్య రంగంలో అత్యంత కీలకమైన నర్సింగ్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారింది. ఒకప్పుడు ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణలో పద్ధతి ప్రకారం కొనసాగిన ఈ వ్యవస్థ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తీవ్ర నిర్లక్ష్యానికి గురైందనే విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. అనేక నియమ, నిబంధనలను తుంగలో తొక్కి కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. నర్సులు, నర్సింగ్ స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్న ట్యూ టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వంటి వారి పదోన్నతులు, బదిలీలు, పోస్టింగులు…

Read More