
ఇది నిజమైతే…శుభవార్తే…!
హైదరాబాద్ జర్నలిస్టుల చిరకాల ఆశ నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం అందుతోంది. సుమారు మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ లో పనిచేస్తున్న విలేకరులు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి లో సభ్యులకు 2007వ సంవ్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. నిజాం పేట్ ప్రాంతంలో 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాలు…