pawan pan c

కదులుతున్న బిజెపి “పావు”..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ “సనాతన ధర్మ పరిరక్షణ” పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఆయన ఈ నెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో సనాతన ధర్మ బాట పట్టనున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో నాలుగు రోజులు పాటు వివిధ దేవాలయాలను సందర్శిస్తారు. మొదట కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడి నుంచి తమిళనాడు లోని మధుర మీనాక్షి, శ్రీపరుశరామస్వామి, అగస్థ్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై…

Read Full News
shake c

“సారు”తో నలుగురు…!

తెలంగాణ అంటే నేనే అంటూ విర్రవీగిన నాయకులు కెసిఆర్.. ఇరవై నాలుగేళ్ల పాలనలో మితిమీరిన విశ్వాసం ఒరిస్సా నేత నవీన్ పట్నాయక్ సొంతం.. కేవలం మరాఠీ భావజాలంతో రాజకీయ వ్యూహ రచనలు లేని మరో నేత ఉద్ధవ్ ఠాక్రే. అవినీతిని ఊడ్చి వేస్తామంటూ పదేళ్లు దేశ రాజధానిని ఏలి, “చీపురు కట్టను కవిత మద్యం”లో కలిపిన కేజ్రీవాల్… నా మాటే వేదం అంటూ ఆంధ్రప్రదేశ్ లో పాలనను గాడి తప్పించిన మహానేత తనయుడు జగన్ మోహన్ రెడ్డి……

Read Full News
mic c

మైకుల విలువ తెలియదా..!

దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు వేదిక అవసరం. అందుకే  ఢిల్లీలో పార్లమెంట్, రాష్ట్రాల్లో శాసన సభలు పని చేస్తోంది. రాజ్యాంగంలోని నియమ, నిబంధనలకు లోబడి పని చేస్తున్న ఈ చట్ట సభలను గౌరవించడం ప్రతీ పౌరుడి నైతిక బాధ్యత. ప్రజల సంక్షేమం కోసం కొలువుదీరినవే ఈ సభలు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో గంపెడు ఆశలతో, కొండంత నమ్మకంతో నేతలను తమ ప్రతినిధిలుగా ఎన్నుకొని చట్టసభలకు పంపుతారు. ప్రజా సమస్యలను, వారి సంక్షేమానికి అవసరమైన పనులు, పధకాలపై…

Read Full News
physic.jpg c

రోగమా…ధర్మమా…!

“సనాతన ధర్మం” అనే పదాన్ని సాకుగా నూలుపోగు లేకుండా వీధుల్లో సంచరిస్తున్న ఓ మానసిక రోగి పట్ల పోలీసులు,ఇతర ప్రభుత్వ అధికారులు అవలంభిస్తున్న తీరు ఆందోళనకు గురి చేస్తోంది. దిశా, నిర్దేశం లేకుండా, పోలీసులు, దేవాలయాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఓ కారు వేసుకొని నగ్నంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై విచ్చల విడిగా తిరుగుతున్న సాధు మహిళ పై ప్రభుత్వాలు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనేది ప్రశ్నార్థకం. తనను అడ్డుకున్న పోలీసు అధికారులపై లేనిపోని అభాండాలు వేయడం, తన యద…

Read Full News
Screenshot 20250130 094650 WhatsApp

“పడుకో” పెడతావా..!

రాజకీయాల్లో మీరు ఏ గొడుగు కింద పెరిగారో కానీ మిమ్మల్ని పెంచి పోషించిన నేత సరైన శిక్షణ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా మీకున్న అజ్ఞానం వల్ల ఆ రాజకీయ సూక్తులు, అందులోని మెళకువలు మీ ఒంట పట్టలేదనేది అర్థం అవుతోంది. మీకున్న “బెదిరింపు కళ”కు నియోజక వర్గంలో గుండా గిరి దుకాణం పెట్టుకుంటే బాగుండేది. పొరపాటున టిక్కెట్ రావడం, దారి తప్పి గెలవడం ప్రజల దురదృష్టం అనుకుంటా. 2001వ సంవత్సరంలో ఎంపీటీసీగా ఓడిపోయిన మీరు అసెంబ్లీలో అడుగు…

Read Full News
CHIRU C

“అందరివాడు” క్లైమాక్స్ ఏమిటి..!

నటునిగా ఆయనకు తిరుగు లేదు. 70 ఏళ్ల వయస్సు మీద పడుతున్నా, పాత తరానికే కాదు, నేటి యువతరానికి కూడా ఆయన తెరపై కనిపిస్తే ఆ మజానే వేరు. సినిమా హిట్టు, ప్లాప్ లతో సంబంధం లేదు. ఆయన బొమ్మ, స్టెప్పులు మాత్రమే చాలు అంతే అదే లెక్క. . అయితే, తనకున్న అశేష ప్రేక్షక ఆదరణతో ఏదో ఆశించి, ఎంతో ఊహించి”చిరు”వేచిన తప్పటడుగు రాజకీయ తెరపై మాత్రం కోలుకోలేని “ప్లాప్” ని ఇచ్చింది. ఉదయించే సూర్యుడు…

Read Full News
sry govinda cf

“గోవిందా”… మన్నించు….!

కృత, త్రేతా, ద్వాపర యుగాలను ఏలిన ఓ స్వామి… నీకు కలియుగ పోకడలు తెలియనివి కాదు. ఈర్ష్య ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు, ఎత్తులు-పై ఎత్తులు ఆనాటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతున్న సంగతి జగమెరిగిన సత్యమే. కాకపోతే, ఈ కలియుగంలో అవి కాస్తా పరాకాష్టకు చేరడం ఏడు కొండల మీద నిశ్చల రూపుడివైన నిన్ను కన్నెర్రకు గురిచేశాయి. సందేహం లేదు..సకల జనుల సంతోషాన్ని కోరే నీకు ఆగ్రహం తెప్పించే అనేక విషయాలు తిరు గిరులను చుట్టు ముడుతున్నాయి.  పవిత్ర…

Read Full News
benfit cf

బ్లాక్ టికెట్ కి “బెనిఫిట్” ముద్ర..!

అమాయక ప్రేక్షకుల నుంచి అడ్డగోలుగా డబ్బు గుంజే ప్రయత్నంలో సినిమాల “ప్రత్యేక ప్రదర్శన” అర్థమే మారిపోయింది.  చిత్ర పరిశ్రమ వ్యవహారంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వింత విధానాలు, నిర్మాతల “స్క్రీన్ ప్లే” విస్మయం కలిగిస్తున్నాయి. సినిమా తీసి దాన్ని డిస్ట్రిబ్యూటర్ (పంపిణీదారుల) వ్యవస్థ ద్వారా ప్రేక్షకులకు అందించాలనే పద్ధతి కొన్నేళ్ల కిందటి వరకు ఉండేది. ప్రజల డబ్బుతో బడా నిర్మాతలుగా ఎదిగిన కొందరు నిర్మాతలు మొదటి వారంలో డిస్ట్రిబ్యూటర్ లను పక్కన పెట్టి తమ పెట్టుబడిని…

Read Full News
jnj sup2 c copy

అంతిమ తీర్పు – అయోమయం..!

భారత రాజ్యాంగం…బ్రిటిష్ పాలకుల మూలాలు ఉన్న దీన్ని, అందులోని అధికరణలను ప్రతీ భారతీయుడు నేటికీ విధిగా అనుసరించాల్సి ఉంది. ప్రతీఒక్క నిబంధనల్ని గౌరవించాలి. ఇది ప్రజాస్వామ్యంలో తప్పదు.దేశ పౌరుల గౌరవాన్ని, తప్పు, చెడులను పర్యవేక్షిస్తూ గాడిన పెట్టే బాధ్యత దేశంలో న్యాయ వ్యవస్థది. దానికి అందరూ తలవంచక తప్పదు. విశాలమైన న్యాయ శాస్త్రంలో తలపండిన మూర్తులు చెప్పిందే శిరోధార్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇదే రాజ్యంగం దేశ పౌరులు తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లినప్పుడు ప్రశ్నించే…

Read Full News
Screenshot 20241203 094717 WhatsApp

అలల మధ్యకు సరే.. అడవి బిడ్డలు మరి..!

గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేక అండమాన్ అడవుల్లో బతుకుతున్నామా అనే సందేహం కలుగుతోంది. వందల, వేల కోట్ల రూపాయల లెక్కలతో గ్రామ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్టు చెబుతున్న ప్రభుతానికి అడవి బిడ్డల గోడు పట్టకలోవడం విచారకరం. విశాఖ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన హృదయ విదారక ఘటనే పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పనితీరుని ప్రశ్నిస్తోంది. వైట్ కాలర్ దొంగలను వెతకడానికి పడవలు వేసుకొని…

Read Full News
shrprabh C

“వాడెవడు”…”ఆయన” ఎవరు..!

జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హుందా తనానికి మచ్చ పడుతోంది. ఆయన ఇతరుల పట్ల ఎంత ప్రేమగా, ఆప్యాయతగా, గౌరవంగా ఉంటారనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరితో కలగలుపుగా ఉండే ఆయన అకాల మరణం నిజంగా చెప్పాలంటే రెండు రాష్ట్రాల వారికి ఎప్పటికీ తీరని లోటే. ఇప్పుడు అది విషయం కాదు. కానీ, ఆ మహానేత వారసులుగా, ఆయన రాజ నీతిని అనుసరించాల్సిన బిడ్డలు అదుపు తప్పి మాట్లాడడం విడ్డూరంగా ఉంది….

Read Full News
suprim jnj cf copy

“సుప్రీమ్” కూల్చిన ఇంటి కల..!

భారత న్యాయ వ్యవస్థ నిజంగా అత్యంత గౌరవ ప్రదమైనది. అందుకే దాని పని తీరును ప్రశ్నిస్తే నేరం, తెలివితక్కువ తనం. అది ఒక రాజ్యాంగ ఉల్లంఘన.. తెలిసి చేసినా, తెలియక చేసినా సుమోటో కింద విచక్షణ అధికారంతో కేసులు.. మరి అదే కోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా కొత్త తీర్పులు వెలువడితే..ఎవర్ని ప్రశ్నించాలి? దిక్కు ఎవరు? న్యాయ శాఖ మంత్రిని కలవాలా? రాజ్యాంగ నిబంధనల అమలు కర్త రాష్ట్రపతిని ఆశ్రయాయించాలా? ఒకవేళ ఆ సాహసం చేస్తే అదీ…

Read Full News
adani c

మోడీ పెంచిన “మనీ”కొండ..!

నరేంద్రమోడీ, నీరబ్ మోడీ, అదానీ… దేశంలో 2014 వరకు ఈ మూడు పేర్లలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే జనానికి తెలుసు. ఎన్.డి.ఎ. అధికారం చేపట్టక ముందు వరకు వ్యాపార రంగంలో అదానీ ఒక అడ్రస్ లేని వ్యక్తి. నీరబ్ మోడీ జాడ కూడా ఎవ్వరికీ తెలియదు. అలాంటి అనామకులు రాజకీయాల అండదండలతో దేశ ప్రజలు చూస్తుండగానే అనతి కాలంలోనే అపర కుబేరులుగా మారారు. వీళ్ళ అక్రమ మార్గాల ధాటికి దశాబ్దాలుగా వివిధ వ్యాపారాల్లో…

Read Full News
nude c

“నగ్న”మైన సనా”తనం”..!

రాజకీయ లబ్ధి కోసం కొత్తగా జడలు విప్పుకుంటున్న “సనాతన ధర్మ” నినాదం దారి తప్పుతోంది. దేశం లోని ప్రతీ హిందువులో అంతర్గతంగా దాగి ఉన్న ఈ ధర్మ సిద్ధాంతాన్ని కొత్త కోణంలో ప్రేరేపించి పబ్బం గడుపు కోవడానికి కొన్ని శక్తులు వ్యూహ రచన చేస్తున్నాయి. దీని కోసం “ఆధునిక” సమాజాన్ని కాస్తా “ఆటవిక” సమాజంగా వెనక్కి లాగే కుతంత్రాలు ఊపందుకున్నాయి. కొందరు  అధికారమే లక్ష్యంగా “ధర్మం” ముసుగులో మున్నెన్నడూ లేని  విధంగా దిగంబరులను జనం మధ్యకు పురిగొల్పే దుస్సాహసానికి …

Read Full News