barrage c

మేడిగడ్డ… రాజకీయ అడ్డా…!

అధికారుల అవినీతి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం. ఎన్నికల వేడిలో అధికార,విపక్ష పార్టీల విమర్శలు,వాదనలు ఎలా ఉన్నా పిల్లర్లు కుంగిపోవడం అధికారుల పర్యవేక్షణ వైఫల్యానికి, గుత్తేదారు నిర్లిప్తతకు ప్రత్యక్ష సాక్ష్యం. కుంగి పోవడానికి దారి తీసిన లోపాలను, కారణాలను ఇంజనీరింగ్ అధికారులే కాదు ప్రభుత్వం కూడా బాధ్యతగా అంగీకరించాలి. వేల కోట్ల ప్రజాధనం ధారగా పోసి ఎన్నో కలలు, ఆశలతో నిర్మించిన సౌధం మూన్నాళ్ళ ముచ్చటగా మారుతుంటే రాజకీయ నాయకుల్లో మాత్రమే కాదు,…

Read More
remand

సాక్ష్యం చూపరు…బెయిల్ ఇవ్వరు…!

అనుమానితులు, నిందితులను పట్టుకున్న 14 రోజుల్లో నేర పరిశోధన పూర్తి చేసి ఆధారాలను కోర్టు ముందు ఉంచాల్సిన పోలీసు యంత్రాంగం నిర్లిప్తత వల్ల అనేక మంది రిమాండ్ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం, అధికారులు, రాజకీయ నేతల తెరచాటు జోక్యం, వాళ్ల ఒత్తిళ్లు ఖైదీలకు శాపంగా మారుతోంది. చట్టల్లోని లొసుగులు కూడా కేసుల సాగదీతకు కారణం అవుతున్నాయి. ఫలితంగా రిమాండ్ ఖైదీల పరిస్థితి దయనీయంగా మారుతోంది. దోపిడి, దొంగతనాల కేసుల్లో దొరికిన నిందితుల విషయాన్ని పక్కన…

Read More
tdp logo 1

“దేశం”పయనం ఎటు…!

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగదేశం పార్టీ ఎవరూ ఊహించని రీతిలో తొలిసారి ఎన్నికల బరికి దూరమైంది. వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి మొహం చాటేయడంతో రాజకీయ పరిశీలకులు సహా సామాన్య జనం ఒక్కసారిగా విస్తుపోయారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో అంకితభావంతో పనిచేస్తున్న క్యాడర్,  కొన్నినియోజక వర్గాల్లో ఇప్పటికీ పట్టు సడలని ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ తెలుగుదేశం పోటీకి దూరం కావడం ఆ పార్టీ మనుగడను మరింత దెబ్బతీసే అవకాశం…

Read More
20231025 155541

“రోమియో” టీచ్చర్స్…!

ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నాణ్యమైన విద్య కోసం కొండంత ఆశతో దేశం నలుమూలల నుంచే కాకా, విదేశ విద్యార్దులు సైతం పెద్ద సంఖ్యలో ఈ క్యాంపస్ లో చేరుతుంటారు. అందుకే హైదరాబాద్ లోని ఇంగ్లిష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం(ఇఫ్లూ). 2007వ సంవత్సరం వరకు కూడా దీన్నే “సిఫెల్”గా పిలిచే వారు. ఇది భిన్న సంస్కృతులకు కేంద్రమని చెప్పవచ్చు. ఈ యూనివర్సిటిలో రకరకాల భాషలకు సంబంధించిన కోర్సులు నేర్చుకునే విద్యార్ధులు చదువుతో పాటు విభిన్న సంస్కృతీ,…

Read More
exclusive c

గాడి తప్పుతున్న రాజకీయం…!

దేశంలోని ఏ రాష్ట్రంలో కనిపించని రాజకీయ వ్యవస్థ అంధ్రప్రదేశ్ లో వేళ్ళూనుకుంటున్నట్టు కనిపిస్తోంది. రాజకీయం వేరు, వ్యక్తిగత వ్యవహారాలు వేరు అనే నానుడికి అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాలం చెల్లుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించిన ఎవరినైనా సరే అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం తప్పు కాదు. ఒక అనుమానితుడిని అరెస్టు చేస్తే అతని నేర విచారణ వ్యవహారం చట్టం, న్యాయం చూసుకుంటాయనేది జగత్ విదితమే. కానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి పూర్తీ భిన్నంగా ఉండడం…

Read More
FB IMG 1697385278554

బి.ఫారం+డబ్బు చరిత్రే…

నాంచారయ్య, సీనియర్ ఎనలిస్ట్ పోలింగ్‌ ముందు పార్టీ అభ్యర్థులకు రహస్యగా కోట్లాది రూపాయలు పంపే ఈ రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రాకుండానే బీ–ఫాంతోపాటు రూ.40 లక్షల చెక్కులు పింపిణీ చేసిన కేసీఆర్‌ నిజంగా కొత్త చరిత్ర రాసేశారా?..పార్టీ అభ్యర్థులకు బీ–ఫాం ఇచ్చిన కొన్ని రోజులకు గుట్టుచప్పుడు కాకుండా, అత్యంత రహస్యంగా పది కోట్ల వరకూ పంపించే నేతలున్న దేశంలో… బీఆరెస్‌ అసెంబ్లీ అభ్యర్థులకు ప్రతి ఒక్కరికీ బీ–పారంతోపాటు రూ.40 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఏకైక ‘జాతీయపక్షం’…

Read More
IMG 20231013 WA0012

ఓట్ల కోసం”కోట్లు”….

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరగనున్న కీలక ఎన్నికల్లో కోట్లాది రూపాయలు వరదలా ప్రవహించే సూచనలుకనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే బా వచ్చిన “కట్టల” పాములు రోజు రోజుకూ అధికమవుతున్నాయి. ఆయా పార్టీలు పొరుగు రాష్ట్రాల నుంచి డబ్బు మూటలను తరలించే ప్రక్రియకు తెరలేపాయి. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న 42 కోట్ల నగదు వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. ఈ డబ్బు ఎక్కడికి, ఎందుకు తరలించే ప్రయత్నం జరిగిందనే విషయంలో ఇప్పటి…

Read More
FB IMG 1697044921618

ఇజ్రాయెల్ పై”ఒంటి కన్ను జాక్స్”…

నాంచారయ్య, సీనియర్ ఎనలిస్ట్ ‘ఒంటి కన్ను జాక్‌’ (హమాస్‌ నేత) దెయిఫ్‌ మొన్న 12 వందల మంది ఇజ్రాయెలీల ప్రాణాలు తీసే ప్లాన్‌ వేస్తే…మరో ‘ఒన్‌ అయిడ్‌ జాక్‌’ శివరాసన్‌ 32 ఏళ్ల క్రితం రాజీవ్‌ గాంధీని దగ్గరుండి మరీ చంపించిన టైగర్ల వ్యూహకర్త!ఉగ్రవాద సంస్థల ‘మాస్టర్‌ మైండ్ల’కు ఒక కన్ను పోయినా మెదడు బాగానే పనిచేస్తుందట!వారం రోజుల యూదుల మ్యూజిక్‌ ఫెస్టివల్‌ సుక్కోత్‌ ముగింపు దశకు చేరిన శనివారం ఇజ్రాయెల్‌ లోకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి….

Read More
rjy jail c

ఆ జైలులో ఏం జరుగుతోంది…!

గతంలో ఎన్నడూ లేని విధంగా రాజమండ్రి కేంద్ర కారాగారం కేవలం కొన్ని రోజులుగానే వార్తల్లోకి ఎక్కుతోంది? దోమల మూలంగా ఒక ఖైదీ చనిపోవడం, ఖైదీల మధ్య గొడవలు తలెత్తడం వంటి ఘటనలు ఈ మధ్యనే ఎందుకు జరుగుతున్నాయి. ఇలా గతంలో కూడా జరిగినా ఆ సమాచారం బయటకు పొక్కలేదా ? మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండడంతో ప్రతీ ఒక్కరిలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జైలులో జరుగుతున్న సంఘటనలపై అక్కడ విధులు…

Read More
babu pavan

టిడిపి-“సేన”లో పొత్తు చిచ్చు..!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీల పొత్తుల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పెద్ద పార్టీలతో చేతులు కలుపుతున్న పార్టీల వ్యూహాలు సామాన్యులకు అంతు పట్టడం లేదు. గత ఎన్నికలలో అంటకాగిన పార్టీలు ఈ సారి ఎడమొహం పెడమొహంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ శత్రువులుగా మారాయి. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రాలో బిజెపితో కలిసి తిరిగిన జనసేన ఈ సారి రూటు మార్చింది. మొన్నటి వరకు…

Read More
jagan babu pawan

“కురుక్షేత్రం”లో ద్రౌపది ఎవరో…

అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వింత పోకడలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక పార్టీ పై మరో పార్టీ అడ్డూఅదుపూ లేని ఆరోపణలకు దిగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో రాయలసీమ శైలిలో, మరికొన్ని సార్లు బెజవాడ తరహాలో ప్రసంగాలు సాగుతుంటే, ఇంకొన్ని సభల్లో ఏకంగా సినిమా డైలాగులను మరిపించే విధంగా మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగుదేశం నేతలపై మంత్రి రోజా చేస్తున్న ఘాటైన విమర్శలకు అదే స్థాయిలో  రోజాపై టిడిపి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో…

Read More
sharmila sonia rahul

ఎలా…!

ఎన్నో ఆశలతో తెలంగాణ ఆడపడుచు అంటూ రాజకీయ చట్రంలో దిగిన వై.ఎస్.షర్మిల సారథ్యంలోని వై.ఎస్.అర్. తెలంగాణ పార్టీ భవితవ్యం ఎటూ తేలకుండా ఉంది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో అంటకగుతున్న షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తన పార్టీ షరతులను ఢిల్లీ పెద్దల చెవిన వేసి ఈ నెల 30వ తేదీని విలీన వ్యవహారానికి తుది గడువు విధించింది. గతంలో ఆమె పాలేరు సీటుని ఆశించింది. ఖమ్మం జిల్లాలో…

Read More
pawan 16

పవన్ ఎక్కడ…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ? చంద్రబాబు అరెస్టు అనంతరం రాజమండ్రి జైలులో  ఆయన్ని కలిసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించిన పవన్ ఎక్కడ ఉన్నారు? పార్టీ శ్రేణులతో బిజీగా ఉన్నారా? లేక సినిమా షూటింగుల్లో మునిగి పోయారా ? ఏ విషయం తెలియక “సేన” సైన్యం సందిగ్ధంలో ఉంది. వచ్చే నెలలో అయన వారాహి యాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో తెలుగదేశం పార్టీ పొత్తుకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. టిడిపితో పొత్తు…

Read More
babu pawan c

ఆ పొత్తు నిజమేనా…!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగదేశం, జనసేన మధ్య పొడపొచ్చలు వచ్చినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు రిమాండ్ తో రాజమండ్రి కేంద్ర కారాగారానికి వెళ్ళగానే హుటహుటీన బాబుని జైలులో కలిసి వచ్చే ఎన్నికలలో టిడిపితో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన సరళి మారిందా అనే సందేహం తలెత్తుతోంది. సుమారు 15 రోజులుగా చంద్రబాబుకు సంబంధించి పవన్ నుంచి ఒక్క ప్రకటన కూడా వెలుగు చూడక పోవడంతో ఆయా పార్టీ శ్రేణులు సందిగ్ధంలో పడ్డాయి.ఇటు బాబు…

Read More
exclusive

మళ్లీ మొదలవుతోందా….!

రాజకీయ, సామజిక  ఉద్యమాలకు పురుటి గడ్డగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు మళ్లీ జడలు విప్పుతున్నాయా? కమ్మ, కాపు, రెడ్డి అంటూ ఆధిపత్య పోరుకు ఆయా వర్గాలు కోరలు చాస్తున్నాయా? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రలో  సర్దుమణిగాయనుకున్న కులాల కక్షలు తిరిగి పెట్రేగుతున్నాయా? మూడు, నలుగు దశాబ్దాల నాటి మాదిరిగా పగలు, ప్రతీకారాలు కారాలు, మిర్యాలు దంచుతున్నాయా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ సామాన్యుని మదిని  తొలుస్తున్నాయి. గత పక్షం రోజులుగా ఆంధ్ర…

Read More