chandrachud

మండిపడ్డ “సుప్రీం”…

మణిపూర్‌ లో జరిగిన అఘాయిత్యాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేసింది. మీడియా, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన దృశ్యాలు, కథనాల ఆధారంగా మణిపూర్‌ ఘటనను “సుప్రీం” సుమోటాగా స్వీకరించింది. ఆ వీడియో దిగ్భ్రాంతికి గురి చేసేదని సీజేఐ నేతృత్వం లోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మే 3వ తేదీన ఈ ఘటన జరిగిందనే సమాచారం అందుతోంది, అలాంటప్పుడు ఇంత కాలం ఎలాంటి చర్యలు తీసుకున్నారు,…

Read More
modi parilimt

సిగ్గుచేటు…

మణిపుర్‌ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన సిగ్గుచేటని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ  దారుణానికి పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడుతూ మణిపూర్ సంఘటన ఆశయంత హేయమైనదని అన్నారు. సమాజంలో ఇలాంటివి చోటుచేసుకోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. నేరాలపై, మరీ ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్టాలను బలోపేతం చేయాలని అన్ని రాష్ట్రాల…

Read More
parlamant

ప్రారంభం..

ప్రారంభం..పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ లో ఛైర్మన్‌, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభా సభ్యుల నుద్దేశించి ప్రసంగించారు. ఇటీవల మృతి చెందిన సిట్టింగ్‌ సభ్యులు, మాజీ ఎంపీ లకు ఉభయ సభలు సంతాపం ప్రకటించారు. ఆ వెంటనే లోక్‌సభ ను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.  అనంతరం రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఆగస్టు 11…

Read More
chandi c

చాందీ కన్నుమూత..

కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కేరళ మాజీ ముఖ్యమంత్రి , సీనియర్ కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. ఈ విషయాన్ని కేరళ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు కె. సుధాకరన్ వెల్లడించారు. 79 ఏళ్ల ఊమెన్ చాందీ బెంగళూరులోని చిన్మయ మిషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. చాందీ కేరళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రెండు సార్లు ముఖ్యమంత్రి గా, 4 సార్లు మంత్రిగా, 12 సార్లు ఎమ్మెల్యేగా దాదాపు ఐదున్నర…

Read More
vande c

తప్పిన ప్రమాదం..

వందే భారత్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. భోపాల్‌ నుంచి ఢిల్లీకి వెళుతున్న వందే భారత్‌ రైలులో మంటలు చెలరేగాయి. రాణి కమలా పాటి స్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత కుర్వాయి స్టేషన్‌ వద్ద సీ-14 కోచ్‌ నుంచి మంటలు వ్యాపించాయి. వీటిని గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే లోకో పైలట్‌ కు సమాచారం అందించారు. దీంతో రైలును వెంటనే ఆపేశారు. రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక…

Read More
Screenshot 2023 07 16 181442

శంఖు..

తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతులు బంగారు శఖు, కుర్మాన్ని సమర్పించారు. మూర్తి అతని భార్య సుధా మూర్తి నేడు తిరుమల వెంకటేశ్వరరునికి ప్రార్థనలు చేసి స్వామికి వారికి 2 కిలోల బంగారు శంకు , కూర్మాన్ని అందజేశారు.

Read More
Screenshot 2023 07 16 173809

చిరుత పులా..ఐతే..

పిల్లిని చూస్తేనే భయపడతారు కొందరు…అదే చిరుత అంటే ఆమడ దూరం పరుగెడతారు. అలాంటిది ఓ యువకుడు ఏకంగా చిరుత పులిపై విరుసుకు పడ్డాడు. దాన్ని కొట్టి పట్టుకుపోయి అధికారులకు అప్పజెప్పాడు. నిజమే.. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లా పరిధిలోని అరసీకెరె తాలూకా గండాసి హోబ్లీ బాగివాలు అనే గ్రామంలో జరిగింది. వేణుగోపాల్ అలియాస్ ముత్తు అనే యువకుడు పొలానికి వెళ్తుండగా చిరుతపులి దాడి చేసింది. ఆ యువకుడు ధైర్యం చేసి దానిపై ఎదురు దాడి…

Read More
logo c

“కలం”జోలికి వెళ్తే…..

దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు, పాత్రికేయులను బెదిరించినా, వాళ్ళను తిట్టినా లేదా కొట్టినా 50 వేల జరిమానా కాదంటే ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష తప్పవని అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పలువురు జర్నలిస్టులు తమ వృత్తి పరంగా ఎలాంటి భయాందోళన లకు గురి కాకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలు జర్నలిస్టు సంఘాల నేతలు,…

Read More
Screenshot 2023 07 14 143645

ఈ సారి పట్టేస్తా “మామా”…

చందమామను అందుకోవాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కల ఆచరణ రూపం దాల్చింది. నిన్న 1.05 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించుకున్న చంద్రయాన్‌-3 ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన మార్క్‌ (ఎల్ వి ఎం 3)ఎం4 వాహక నౌక నింగిలోకి దూసుకుపోయింది. 2019లో చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న పట్టుదలతో శాస్త్రవేత్తలు ఈ  ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టారు. ఇస్రో 2019 జూలై 22న చేపట్టిన చంద్రయాన్‌-2…

Read More
parlamant

ఆ బిల్లు లేదు..

ఈనెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 27 బిల్లు ఉభయసభల ముందుకులు రానున్నాయని కేంద్రం తెలిపింది. వీటిలో 21 బిల్లులు కొత్తవి కాగా,  మరో ఆరు బిల్లులు ఇప్పటికే సభలో ప్రవేశపెట్టి స్థాయీ సంఘాలకు ప్రతిపాదించినవి వివరించింది. అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఈ జాబితాలో చేర్చక పోవడం గమనార్హం.

Read More
run

కంగ్రాట్స్ జ్యోతి…

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ మహిళల 100 మీటర్ల హార్డిల్స్ లో ఆంధ్రప్రదేశ్ కు  చెందిన జ్యోతి యర్రాజి చరిత్ర సృష్టించారు. ఈ పోటిలో బంగారు పతకం సాధించన తొలి భారత అథ్లెట్ గా నిలిచారు.  ఎన్నో ఆశలతో మొదటిసారి ఆసియా అథ్లెటిక్స్  బరిలో దిగిన జ్యోతి  అంతర్జాతీయ వేదిక పై అపురూప ప్రదర్శన చేసింది. 23 ఏళ్ల ఈ విశాఖ స్ప్రింటర్ ఫైనల్ పోటిలో 13.09 సెకన్ల లో సాక్ష్యాన్ని చేధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

Read More
Screenshot 2023 07 14 104336

“రెడ్” సెక్యూరిటి…

దేశ వ్యాప్తంగా టమాటో ల ధరలు చుక్కలను అంటడంతో  వాటికీ విఐపి  భద్రతా కల్పించాల్సిన పరిస్థితి ఎర్పడింది. కొన్ని ప్రాంతాల్లో టమాటో రైతుల పై దాడులు జరగడం, మరోవైపు కొందరు టమాటోలను దొంగిలించడం వంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అధికారులు టమాటోలకు భద్రతకల్పిస్తున్నారు. మరికొన్ని చోట్ల వ్యాపారులే బౌన్సర్ లను నియమించుకుంటున్నారు. ఆసియాలోనీ రెండో అతిపెద్ద టమాటో మార్కెట్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో ఉంది.  ఇక్కడకు పెద్ద ఎత్తున టమాటాలు రావడంతో  ముందు జాగ్రత్తగా ప్రభుత్వం…

Read More
Screenshot 2023 07 13 091710

నమస్తే.. నా పేరు లీసా..

ఛానల్స్ లో ఇక మరింత సాంకేతిక మార్పు రావచ్చు. ప్రత్యేకంగా అందమైన యాంకర్ల కోసం వెతకడం, వాళ్ళను ఇంటర్వ్యూలు చేసి, వడపోసి ఎంపిక చేయడం లాంటి ప్రక్రియలకు భవిష్యత్తులో తెర పడవచ్చు. తడబాట్లు , బిడియం వంటి తలనొప్పులకు తావులేకుండా బుట్ట బొమ్మల్లాంటి యాంకర్లతో కార్యక్రమాలు చేయించ వచ్చు. ఎలాంటి యాంకర్లు, న్యూస్ రీడర్లు కావాలో ఉహించుకొని అలాంటి వాళ్ళను తెరపై చూపవచ్చు. అందుబాటులోకి వస్తున్నా సాంకేతిక పరిజ్ఞానం ఈ వెసులుబాటును కల్పించనుంది. అదే ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్…

Read More
Screenshot 2023 07 12 220255

పోలీసు రక్షణ లోనే…

రాజస్తాన్ గ్యాంగ్ స్టార్ కుల్దిప్ జగినా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. పోలీసులు అతన్ని కోర్టుకు తీసుకువెళ్తుండగా భారత్ పూర్ వద్ద గల అమోలి టోల్ ప్లాజా వద్ద కుల్దిప్ ప్రత్యర్ధి ముఠాకు చెందిన వారు కాల్చి చంపినట్టు రాజస్తాన్ డిజిపి ఉమేష్ మిశ్రా చెప్పారు. సంఘటనకు సంబంధించి విచారణ చేపట్టినట్టు తెలిపారు. పోలీసు వాహనంలోనే అంత బందోబస్తు మధ్య కుల్దిప్ ను హతమార్చడం పై అనుమానాలు తలెత్తుతున్నాయి.

Read More