taraluf c

“రాములమ్మ”జాడ లేదు..”శివరంజని”ఊసు లేదు…!

గత రెండు దశాబ్దాలుగా ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు వివిధ రాజకీయ పార్టీలు జనాకర్షణ కోసం సినీ నటులపై దృష్టి సారించేవి. ఏదో రకంగా వాళ్ళను రంగంలోకి దించేవి లేదా ఆసక్తి ఉన్న నటులే ముందుకు వచ్చి తమకు నచ్చిన పార్టీల పంచన చేరే వారు. కానీ, ఈ ఎన్నికల్లో ఆ తంతు జాడ లేకుండా పోయింది.గత ఎన్నికల వరకు కూడా సీట్లు, ప్రచారల్లో సందడి చేసిన “వెండి తారలు”ఈ సారి తెలంగాణ శాసన సభ ఎన్నికల తెరపై…

Read More
pawnshrml c

“మాట”మారింది…”మడమ”తిరిగింది!

తెలంగాణ ఎన్నికల్లో జనసేన, వైఎస్అర్ తెలంగాణ పార్టీల నిర్ణయాలు రాజకీయ పరిశీలకులను, సాధారణ ప్రజానీకాన్ని సందిగ్దంలో పడేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బలమెంతో స్పష్టంగా తెలియని ఆ రెండు పార్టీ లు రోజుకో దారిని వెతకడం ఓట్ల చిలికకు దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వ్యూహంలో జనసేన తీసుకుంటున్న నిర్ణయాలు, తెలంగాణా ప్రాంతంలో వైఎస్అర్ తెలంగాణా పార్టీ  వ్యవహారాన్ని పరిశీలిస్తే ఈ రెండు పార్టీలు దేన్నీ ఆశించి రాజకీయాలు…

Read More
sanjay nomin

సందడిగా “సంజయ్” నామినేషన్..

కరీంనగర్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నా. నిండు మనస్సుతో మీ బిడ్డను ఆశీర్వదించండి. అత్యధిక మెజారిటీతో గెలిపించండి.’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. ఈరోజు వేద పండితులు నిర్ణయించిన ముహుర్తానికి కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా 2 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్.విఠల్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్ల రమేశ్, సోదరుడు బండి సంపత్, కిరణ్ సింగ్…

Read More
pawan kishan manohar

మళ్ళీ“మోడీ”రావాలి…!

దేశానికి నరేంద్ర మోడీ ఇంకోసారి ప్రధానమంత్రి కావలసిన ఆవశ్యకత ఉందని, ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనాలని ఆహ్వానం అందినట్టు తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ “ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ జీహెచ్ఏంసీ…

Read More
tdp logo 1

“దేశం”పయనం ఎటు…!

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగదేశం పార్టీ ఎవరూ ఊహించని రీతిలో తొలిసారి ఎన్నికల బరికి దూరమైంది. వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి మొహం చాటేయడంతో రాజకీయ పరిశీలకులు సహా సామాన్య జనం ఒక్కసారిగా విస్తుపోయారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో అంకితభావంతో పనిచేస్తున్న క్యాడర్,  కొన్నినియోజక వర్గాల్లో ఇప్పటికీ పట్టు సడలని ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ తెలుగుదేశం పోటీకి దూరం కావడం ఆ పార్టీ మనుగడను మరింత దెబ్బతీసే అవకాశం…

Read More
Screenshot 20231002 004606 WhatsApp

వరాల “మోడీ”…

ములుగు జిల్లాలో 9 వందల కోట్ల రూపాయల వ్యయంతో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణలోసుమారు 13,500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే వివిధ రకాల అభివృద్ధి పనులకు అయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. సమ్మక్క- సరక్క ల పేరుతో గిరిజన యూనివర్సిటీ ప్రారంభించనున్నట్టు వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో పసుపు…

Read More
pawan 16

పవన్ ఎక్కడ…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ? చంద్రబాబు అరెస్టు అనంతరం రాజమండ్రి జైలులో  ఆయన్ని కలిసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించిన పవన్ ఎక్కడ ఉన్నారు? పార్టీ శ్రేణులతో బిజీగా ఉన్నారా? లేక సినిమా షూటింగుల్లో మునిగి పోయారా ? ఏ విషయం తెలియక “సేన” సైన్యం సందిగ్ధంలో ఉంది. వచ్చే నెలలో అయన వారాహి యాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో తెలుగదేశం పార్టీ పొత్తుకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. టిడిపితో పొత్తు…

Read More
3 party

“మార్పు” ముంచొచ్చు..!

వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలులోకి వస్తే తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు భారీ కసరత్తు చేయాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. దాదాపు 35 స్థానాలకు పైగా మహిళల చేతుల్లోకి వెళ్ళాక తప్పదు. మహిళా జనాభా ఆధారంగా చేసుకొని నియోజక వర్గాల కేటాయింపులు జరిగే అవకశాలున్నాయనే సమచారం అందుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి (బి. అర్.ఎస్.) మళ్ళీ కొత్త జాబితాను తయారు చేయాలి, సరైన మహిళా అభ్యర్ధులను…

Read More
pravin

బిజెపిలోకి “క్యాసినో”…

ఆంధ్రప్రదేశ్, గోవా, ధాయిలాండ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన క్యాసినోలతో తెరపైకి వచ్చిన చీకోటి ప్రవీణ్ బిజెపిలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కలిసినట్టు సమాచారం అందుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ప్రవీణ్ కమలం కండువా కప్పుకోనున్నారు.

Read More
jayasudha join c

తీర్ధం…

సినీ నటి  జ‌య‌సుధ భారతీయ జనతా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఢిల్లీలో త‌రుణ్ చుగ్‌, కిష‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ఆమె బీజేపీ చేరారు.

Read More
amishaa

హైదరాబాద్‌ కు అమిత్ షా…

 బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రత్యేక విమానంలో అమిత్‌ షా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక సంఘాల నాయకులతో భేటీ అవుతారు. సాయంత్రం 5:15 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్‌కు చేరుకొని 8 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో భేటీ…

Read More