jagansrmil

అక్కడ ఇక రసవత్తరం…!

కొద్ది నెలల్లో జరగనున్న ఆంద్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. వివిధ జిల్లాల్లోని 175 నియోజక వర్గాలకు జరిగే పోరులో ప్రధానంగా ఐదు రాజకీయ పక్షాలు తలపడనున్నాయి. దీని కోసం ఇప్పటి నుంచే ఎత్తులు, పై ఎత్తులు, సమీకరణలకు నడుం బిగించాయి. ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో  రాజకీయ రచ్చబండ వద్ద కొత్త తరహా చర్చలకు తెరలేపింది. జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో అంధ్రలో ఒక్కసారిగా జవసత్వాలు…

Read Full News
shrmil rahul

రాహుల్ ప్రధాని కావాలి…

రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయమని కాంగ్రెస్ నేత వై.ఎస్. షర్మిల చెప్పారు. వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీని ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి షర్మిలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత అని, ఆయన…

Read Full News
banana c

రాజకీయాల్లో”అరటి పండ్లు”…!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో “అరటి పండు”పార్టీల ఎత్తుగడలు అంతుపట్టకుండా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న జనసేన, వై.ఎస్.షర్మిల ఆధ్వర్యం లోని వై.ఎస్.ఆర్.తెలంగాణ (వైఎస్ఆర్ టి) పార్టీలు ఎన్నికల సమయంలో వ్యవహరిస్తున్న తీరు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలవ్వగానే తమ బలం ఎంత ఉన్నదనే కనీస విషయాన్ని అంచనా వేసుకోకుండా బరిలోకి దిగడం వెనుక అసలు రహస్యం ఏమిటనే  కోణంలో చర్చలకు తెర లేస్తోంది. తెలంగాణ శాసనసభకు గత నెలలో జరిగిన…

Read Full News
funds copy

గడి దాటని“దొర”-గల్లంతైన“నిధులు”!

తెలంగాణలో మొన్నటి వరకు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రంతో కొన్నేళ్ళుగా తెగిపోయిన సంబంధాల వల్ల వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంతో సన్నిహితంగా ఉండాల్సిన “ఒంటెద్దు” ప్రభుత్వంలో తానే అన్నీ అన్నట్టు వ్యవహరించి చివరకు రాష్ట్రపతి, ప్రధాని వంటి వారిని సైతం లెక్క చేయకపోవడంతో రాష్ట్రానికి రావలసిన నిధులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజకీయంగా విభేదాలు ఉన్నా పరిపాలన పరంగా చేయాల్సిన పనులను కూడా వ్యక్తిగతంగా…

Read Full News
Screenshot 20231228 213438 WhatsApp

మోడీ మెడిసిన్ ఖతం..

దేశంలో నరేంద్ర మోడీ అనే మెడిసిన్ కు గడువు తేదీ అయిపోయిందని, మోడీ మెడిసిన్ ఇక పని చేయదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో రేవంత్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎప్పుడూ చప్పన్ ఇంచ్ ఛాతీ అని గొప్పలు చెప్పుకుంటారనీ. ఆయన నేతృత్వంలో నడుస్తున్న లోకసభలోనే ఒక సామాన్యుడు ప్రవేశించి హంగామా చేస్తుంటే ఏమి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్…

Read Full News
whitepaper

ఇంకా తగ్గలే….!

ముఖ్యమంత్రి  హోదాలో ఉన్న వ్యక్తి “ఒంటెద్దు” పోకడగా వ్యవహరిస్తే అతన్ని నమ్ముకున్న ప్రజలకు ఎంత నష్టమో, ఎంత కష్టమో తెలంగాణ జనానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పదేళ్ళ పాటు నగరం నడిబొడ్డున  ప్రగతి భవన్ కేంద్రంగా సాగిన పాలన కేవలం హంగామా మాత్రమే అనే విషయాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. దశాబ్ద పాలనలో అభివృద్ధి ముసుగులో ఆరు లక్షల కోట్ల రూపాయల  అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన మోపారనే సత్యాన్ని…

Read Full News
batti people

నిజంగా “విక్రమర్కుడే”…!

క్రమశిక్షణకు మారు పేరు, పార్టీ పట్ల అంకితభావం, పార్టీ విధేయతకు, నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపం మల్లు భట్టి విక్రమార్క.కష్టపడే మనస్తత్వం కలిగిన విక్రమార్క ఎన్ ఎస్ యు ఐ  కార్యకర్త నుంచి అంచలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కోసం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మండుటెండలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తనదైన పాత్రను పోషించారు. ఎమ్మెల్సీగా గెలుపొంది చీఫ్ విప్పుగా, డిప్యూటీ స్పీకర్…

Read Full News
brs stratgy

ప్రభుత్వంపై“భారాస”కుతంత్రం..?

పదేళ్లుగా ఒంటెద్దు పోకడల ప్రభుత్వంలో పదవుల రుచి చూసిన భారత రాష్ట్ర సమితి నేతలు ఓడిపోయినా ఇంకా మేకపోతు గాభీర్యం ప్రదర్శించడం విమర్శలకు దారి తీస్తోంది. తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో భారాస నేతలు ఆ ప్రభుత్వాన్ని కూలదోస్తామనే ధోరణిలో ఆలోచనలు చేయడాన్ని రాజకీయ పరిశీలకులే కాదు సామాన్య ప్రజలు సైతం ఖండిస్తున్నారు. రాజకీయాల్లో అనుభవం ఉన్న భారాస నేత కడియం శ్రీహరి…

Read Full News
hatric

“ఒక్కఛాన్స్”పై ఓడిన”ఒంటెద్దు”…!

తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో అనుకున్నదే జరిగింది. ఎవరికైనా, ఏ పార్టీకి అయినా సరే ముడోసారి అధికారం కట్టబెట్టేదే లేదని ఓటర్లు తేల్చి వేశారు. “ఒక్క ఛాన్స్” కోరికకు పట్టం కట్టి, “హ్యాట్రిక్” కలలను కలగానే ఉంచారు. ఒంటెద్దు పోకడల పాలకులను వ్యవసాయ క్షేత్రాలకే పరిమితమయ్యేలా చేశారు. గత నెల ౩౦న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న భారత రాష్ట్ర సమితిని ఇంటికి పంపి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరధం పట్టారు….

Read Full News
surve 1c

ఒంటెద్దు పోకడ-అతి ఆలోచనలు..!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత  మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఉద్యమ పార్టీగా పిలవబడుతున్న బీఆర్‌ఎస్‌కు ఎదురే లేదు, కాంగ్రెస్‌ ఇక రాదు అనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల ముందు ఉన్న పరిస్థితులు పోలింగ్ నాటికి ఒక్కసారిగా తిరగబడ్డాయి. రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు పడుతున్న ప్రజలకు “ఒక్క ఛాన్స్” ఇవ్వడి అంటూ పక్కాగా అమలు చేసే ఆరు రకాల గ్యారంటీ పధకాలతో కాంగ్రెస్ పార్టీ , “హ్యాట్రిక్‌” విజయంపై గట్టి…

Read Full News
hatric cfy

“హ్యాట్రిక్” వర్సెస్ “వన్ ఛాన్స్”…!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత శాసన సభకు ముడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అత్యంత ఉత్కంటభరితంగా ఉన్న ఈ ఎన్నికల్లో ప్రజలు తమ నాయకులను ఎన్నుకోవడానికి పోలింగ్ కేంద్రాలు సిద్దమైయాయి. ఈ సారి కూడా అధికారం తమదే అవుతుందని అధికార భారత రాష్ట్ర సమితి ధీమాగా ఉంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సైతం ప్రజలు తమకే పట్టం కడతారని కొండంత ఆశతో ఉంది. భారతీయ జనతా పార్టీ  కూడా రాష్ట్రంలో గులాబీ రంగు కాస్తా కషాయంగా…

Read Full News
sonia cf

కలలు సాకారం చేసుకోండి…

తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం పంపారు. ప్రియమైన సోదర, సోదరీమణులారా నేను మీ దగ్గరకు రాలేకపోతున్నాను,కానీ  మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారని, నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని సోనియా పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం చూడాలనుకుంటున్నట్టు, దొరల తెలంగాణ ప్రజల తెలంగాణగా మారాలని ఆశిస్తున్నట్టు, తెలంగాణ ప్రజల కలలు సహకారం అవ్వాలని కోరుకుంటున్నట్టు సోనియా తెలిపారు. సోనియమ్మ అని పిలిచి నాకు చాలా గౌరవం ఇచ్చారని, మీకు…

Read Full News
rahul selfi

ప్రచారంలో “రేవంత్” దూకుడు..!

ఈ నెల 30న జరగనున్న తెలంగాణ శాసన సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో ప్రచారం నిర్వహించారు. నోటిఫికేషన్ నుంచి ప్రచారం ముగిసే వరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ దాదాపు 63 నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. అక్టోబర్ 16న వికారాబాద్ లో నిర్వహించిన సభ నుంచి నవంబర్ 28న మాల్కాజిగిరి రోడ్ షో వరకు దాదాపు 87 సభలో పాల్లొన్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవేళ్ల, ములుగు,…

Read Full News
money c

రోడ్డుపై”లక్ష్మీ”కళ…!

మేడ్చల్ నియోజక వర్గం పరిధిలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓటర్లకు డబ్బులు పంచుతున్న కొందరిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. పోటీలో ఉన్న ఓ అభ్యర్ధికి చెందిన కళాశాల సిబ్బంది, కొందరు విద్యార్థులు ఈ కాబ్బు పంపకాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వారి వద్ద ఉన్న లిస్టును బట్టి విచారిస్తే మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉందని కాంగెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Read Full News
rahul priya

కెసిఆర్ చదివిన స్కూలు మేము కట్టిందే…!

తెలంగాణను ప్రతేక రాష్ట్రంగా చేసి, ఇక్కడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీయే అని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్పారు. కెసిఆర్ చదువుకున్న స్కూలుని కట్టించిది కుడా కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పదేపదే అడుగుతున్న ప్రశ్నకు ఇదే నా సమాధానం అన్నారు.  తెలంగాణ ముసుగులో బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా ప్రజలను నిలువు దోపిడీ చేసిందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు…

Read Full News