
“పడుకో” పెడతావా..!
రాజకీయాల్లో మీరు ఏ గొడుగు కింద పెరిగారో కానీ మిమ్మల్ని పెంచి పోషించిన నేత సరైన శిక్షణ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా మీకున్న అజ్ఞానం వల్ల ఆ రాజకీయ సూక్తులు, అందులోని మెళకువలు మీ ఒంట పట్టలేదనేది అర్థం అవుతోంది. మీకున్న “బెదిరింపు కళ”కు నియోజక వర్గంలో గుండా గిరి దుకాణం పెట్టుకుంటే బాగుండేది. పొరపాటున టిక్కెట్ రావడం, దారి తప్పి గెలవడం ప్రజల దురదృష్టం అనుకుంటా. 2001వ సంవత్సరంలో ఎంపీటీసీగా ఓడిపోయిన మీరు అసెంబ్లీలో అడుగు…