updates
alla

“ఆళ్ళ”రాజీనామా …!

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శికి ఆళ్ల రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని ఆళ్ళ అసంతృప్తితో ఉన్నారు. అలాగే రూ.1250 కోట్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని కూడా ఆగ్రహంతో ఉన్నారు. తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆళ్ల…

Read More
surve 1c

ఒంటెద్దు పోకడ-అతి ఆలోచనలు..!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత  మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఉద్యమ పార్టీగా పిలవబడుతున్న బీఆర్‌ఎస్‌కు ఎదురే లేదు, కాంగ్రెస్‌ ఇక రాదు అనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల ముందు ఉన్న పరిస్థితులు పోలింగ్ నాటికి ఒక్కసారిగా తిరగబడ్డాయి. రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు పడుతున్న ప్రజలకు “ఒక్క ఛాన్స్” ఇవ్వడి అంటూ పక్కాగా అమలు చేసే ఆరు రకాల గ్యారంటీ పధకాలతో కాంగ్రెస్ పార్టీ , “హ్యాట్రిక్‌” విజయంపై గట్టి…

Read More
hatric cfy

“హ్యాట్రిక్” వర్సెస్ “వన్ ఛాన్స్”…!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత శాసన సభకు ముడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అత్యంత ఉత్కంటభరితంగా ఉన్న ఈ ఎన్నికల్లో ప్రజలు తమ నాయకులను ఎన్నుకోవడానికి పోలింగ్ కేంద్రాలు సిద్దమైయాయి. ఈ సారి కూడా అధికారం తమదే అవుతుందని అధికార భారత రాష్ట్ర సమితి ధీమాగా ఉంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సైతం ప్రజలు తమకే పట్టం కడతారని కొండంత ఆశతో ఉంది. భారతీయ జనతా పార్టీ  కూడా రాష్ట్రంలో గులాబీ రంగు కాస్తా కషాయంగా…

Read More
band

మూగవోయిన ప్రచారం…

తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నెల రోజుల పాటు హోరాహోరీగా సాగిన  ప్రచారంలో మారుమోగిన మైకు శబ్దాలు ముగాబోయాయి. ౩౦వ తేదిన జరిగే పోలింగ్ ప్రక్రియకు ఎన్నికల సంఘం అన్ని  ఏర్పాట్లు పూర్తీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 శాసన సభ నియోజక వర్గాల్లో 2,290 మంది  అభ్యర్ధులు బరిలో నిలిచారు. మొత్తం 35,655 పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 45 వేల మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొంటారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు…

Read More
3 party

కాంగ్రెస్ కి 74 సీట్లు : లోక్ పోల్

తెలంగాణ ఎన్నికలపై ప్రముఖ సర్వే సంస్థ లోక్‌పోల్‌ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రానుంది. 74 సీట్లతో కాంగ్రెస్‌ తిరుగులేని విజయం సొంతం చేసుకోబోతోందని, లోక్‌పోల్‌ సర్వే సంస్థ వెల్లడించింది. సీఎం కేసీఆర్‌ కామారెడ్డి- గజ్వేల్‌లో రెండు చోట్లా విజయం సాధించనుండగా, బీఆర్‌ఎస్‌కు మొత్తంగా కేవలం 29 స్థానాలు మాత్రమే దక్కనున్నట్లు పేర్కొంది. ఇక బీజేపీకి 9, మజ్లిస్‌కు 6 స్థానాలు వస్తాయని వెల్లడించింది.  ప్రధానంగా నల్లగొండ, ఖమ్మం  జిల్లాల్లో కాంగ్రెస్‌ దాదాపు అన్ని సీట్లలో…

Read More
cong menifesto

“ఆరు”మాత్రమే కాదు…ఇంకా అనేకం…

పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మాదిరిగా కొద్ది రోజుల్లో జరిగే తెలంగాణ శాసన సభ ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జనాకర్షణకు ప్రయత్నిస్తోంది. అధికార బిఆర్ఎస్ ని ఎదుర్కోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ అధికాయకత్వం ప్రచార రంగంలోకి దిగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే చేపట్ట్టే సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికే రూపకల్పన చేసింది. ప్రధానంగా “సిక్స్ పెయింట్” పార్ములా పై దృష్టి సారించింది. కర్ణాటకలో పార్టీ గెలుపినకు దోహదం చేసిన ఆరు ఆకర్షక పధకాలను…

Read More
taraluf c

“రాములమ్మ”జాడ లేదు..”శివరంజని”ఊసు లేదు…!

గత రెండు దశాబ్దాలుగా ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు వివిధ రాజకీయ పార్టీలు జనాకర్షణ కోసం సినీ నటులపై దృష్టి సారించేవి. ఏదో రకంగా వాళ్ళను రంగంలోకి దించేవి లేదా ఆసక్తి ఉన్న నటులే ముందుకు వచ్చి తమకు నచ్చిన పార్టీల పంచన చేరే వారు. కానీ, ఈ ఎన్నికల్లో ఆ తంతు జాడ లేకుండా పోయింది.గత ఎన్నికల వరకు కూడా సీట్లు, ప్రచారల్లో సందడి చేసిన “వెండి తారలు”ఈ సారి తెలంగాణ శాసన సభ ఎన్నికల తెరపై…

Read More
pawnshrml c

“మాట”మారింది…”మడమ”తిరిగింది!

తెలంగాణ ఎన్నికల్లో జనసేన, వైఎస్అర్ తెలంగాణ పార్టీల నిర్ణయాలు రాజకీయ పరిశీలకులను, సాధారణ ప్రజానీకాన్ని సందిగ్దంలో పడేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బలమెంతో స్పష్టంగా తెలియని ఆ రెండు పార్టీ లు రోజుకో దారిని వెతకడం ఓట్ల చిలికకు దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వ్యూహంలో జనసేన తీసుకుంటున్న నిర్ణయాలు, తెలంగాణా ప్రాంతంలో వైఎస్అర్ తెలంగాణా పార్టీ  వ్యవహారాన్ని పరిశీలిస్తే ఈ రెండు పార్టీలు దేన్నీ ఆశించి రాజకీయాలు…

Read More
sanjay nomin

సందడిగా “సంజయ్” నామినేషన్..

కరీంనగర్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నా. నిండు మనస్సుతో మీ బిడ్డను ఆశీర్వదించండి. అత్యధిక మెజారిటీతో గెలిపించండి.’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. ఈరోజు వేద పండితులు నిర్ణయించిన ముహుర్తానికి కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా 2 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్.విఠల్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్ల రమేశ్, సోదరుడు బండి సంపత్, కిరణ్ సింగ్…

Read More
tdp logo 1

“దేశం”పయనం ఎటు…!

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగదేశం పార్టీ ఎవరూ ఊహించని రీతిలో తొలిసారి ఎన్నికల బరికి దూరమైంది. వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి మొహం చాటేయడంతో రాజకీయ పరిశీలకులు సహా సామాన్య జనం ఒక్కసారిగా విస్తుపోయారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో అంకితభావంతో పనిచేస్తున్న క్యాడర్,  కొన్నినియోజక వర్గాల్లో ఇప్పటికీ పట్టు సడలని ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ తెలుగుదేశం పోటీకి దూరం కావడం ఆ పార్టీ మనుగడను మరింత దెబ్బతీసే అవకాశం…

Read More
IMG 20231027 WA00081

సొంత గూటికి….

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బిజెపిలో చేరిన రెడ్డి తాజాగా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఢిల్లీ లోని ఎ.ఐ.సి.సి. కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు మాణిక్ రావు ఠాక్రే రాజ గోపాల్ కి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

Read More
IMG 20231015 WA0014

నామినేషన్ వేయండి….

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగుతున్న అభ్య‌ర్థుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీ-ఫారాలు అందించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో 51 మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు ఇచ్చారు. ఒక్కో అభ్య‌ర్థికి రెండు బీ-ఫారాలు అందిస్తున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. మిత‌గా వారికి రేపు అందిస్తామ‌న్నారు. కేసీఆర్ త‌ర‌పున గంప గోవ‌ర్ధ‌న్, మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి త‌ర‌పున ఎమ్మెల్సీ క‌విత బీ-ఫార‌మ్ అందుకున్నారు. ఉమ్మ‌డి మెద‌క్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, ఖ‌మ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల‌కు చెందిన బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు అంద‌జేశారు….

Read More
batti c

ప్రజల”చేయి”వదలని “విక్రమార్క”…

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకే కాదు, సామాన్య ప్రజలకు సైతం అందరికి తెలిసిన నేత మల్లు భట్టి విక్రమార్క. ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన రాజకీయ నేపద్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర స్థాయి నేతగా ప్రజలకు చేరువయ్యారు. కాంగ్రెస్ నేతలు, లోక్ సభ మాజీ సభ్యులు స్వర్గీయ మల్లు అనంత రాములు, మరో పార్లమెంటు సభ్యుడు మాజీ శాసన సభ మాజీ సభ్యులు మల్లు రవి సొంత తమ్ముడు విక్రమర్క. 1990వ దశకంలో…

Read More
IMG 20230822 WA0000

నాన్న దగ్గర ఏమైందో…

దేశంలో మహిళలకు అన్ని రంగాల్లో33 శాతం రిజర్వేషన్  కావాలని ప్రధాని మోడీని డిమాండ్ చేసే కల్వకుంట్ల కవిత అదే విషయాన్ని అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికలో వాళ్ళ నాన్న కేసీఆర్ కి ఎందుకు చెప్పలేక పోయిందని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబతా లో బి.ఆర్.ఎస్. మహిళలకు స్థానం కల్పించక పోవడం పై కవిత తెలంగాణ మహిళలకు  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 119 స్థానాల్లో  7మంది మహిళలకు టికెట్…

Read More
jnj members

అటు నిర్లక్ష్యం.. ఇటు నిస్సహాయత…

ఒకవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, అసలు ఏం చేయలనుకుంటుందో తెలియని అయోమయం…. మరోవైపు ఈ సమయంలో చురుకుగా వ్యవహరించాల్సిన  హౌసింగ్ సొసైటీ  నత్త నడక పనులు…సమస్య పరిష్కారానికి సరైన ప్రయత్నాలు చేయకపోవడం ఇవ్వన్నీ కలిసి సభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నాయి. ఈ విషయాల్లోనే  జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్  సొసైటీ  సభ్యుల మధ్య అగాధం పెరగడానికి దారి తీస్తోంది. ప్రభుత్వానికి, జర్నలిస్టులకు మధ్య సమన్వయ కర్తగా ఉండాల్సిన మీడియా అకాడమీ సైతం ఎలాంటి పరిష్కార మార్గాలు వెతుకుతుందో బాహ్య…

Read More