eye c

పొంచివున్న “రెండు కళ్లు”…!

రాజకీయ చాణక్యం, జగన్ పాలనలో లోపాలను వెలుగెత్తిచాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడు కేంద్రంలోనూ చక్రం తిప్పే స్థితిలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రాలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వైభవం అక్కడ ఒక వెలుగు వెలుగుతోందనడంలో సందేహం లేదు. కానీ, చంద్రబాబు అమితంగా ఇష్టపడే హైదరాబాద్ పై ఆయన మమకారం చెక్కుచెదరనట్టు కనిపిస్తోంది. ఛత్రపతి” సినిమాలో “ఒక్క అడుగు” అనే డైలాగు మాదిరిగా, ముఖ్యమంత్రి హోదాలో…

Read More
babu revnt 6

దశాబ్దం కాలంలో తొలి అడుగు…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారంపై హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు నడిశాయి. గత  పదేళ్లలో ఏ వివాదాలూ లేకుండా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత కీలకాంశాల పరిష్కారం దిశగా జరిగిన మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే వివిధ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను పరస్పర సహకారంతో వేగంగా పూర్తిచేసుకోవాలని సమావేశంలో…

Read More
erravlli ala c

చేరికలా… చొరబాటులా…?

తెలంగాణా ఉద్యమ పార్టీ భారత రాష్ట్ర సమితి (భారాస)లో ఏం జరుగుతోంది? ఆ పార్టీకి చెందిన నేతలు ఎందుకు గోడ దూకుతున్నారు?భారాస గొడుగు నీడ గిట్టడం లేదా లేక ఆ పార్టీ అధినేత ఇస్తున్న భరోసా పై నమ్మకం సన్నగిల్లిందా? కేసీఆర్ నమ్ముకున్న నేతలు పక్కా పార్టీల వైపు ఎందుకు ఎగబాకుతున్నారు? భారాస రాజకీయ వ్యూహంలో భాగంగా ఫిరాయింపులు జరుగుతున్నాయా?  లేక నేతలు ఎవరికి వారు సొంత నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటున్నారా? అసలు ఎర్రవల్లి…

Read More
ysr tryam

అలా జరిగింది…

ఓకే వ్యక్తిని అందలం ఎక్కించాలన్నా, అధ:పాతాళానికి తోక్కిపట్టాలన్నా నరం లేని నాలుక చేటు చేస్తుంది. ఎంత తెలివి ఉన్న ఖర్మ సరిగా లేనప్పుడు నాలుక నాలుగు మడతలు తిరుగుతుంది. వ్యక్తి మనుగడకు ప్రధాన వరారు మాటలు పలికించే నాలుక. దాన్ని అదుపులో పెట్టుకొని అవసారానికి తగ్గట్టు వాడుకుంటే ఆ కిక్కే వేరు. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రతగా మాట్లాడాలని, మాట అదుపు తప్పితే ఏం జరుగుతుందో గతంలో చాలా సార్లు చాలా మంది నిరూపించారు. ఆ జబ్బితాలో…

Read More
ramojir c

అకాడమీకి “రామోజీ” పేరెందుకు..!

రామోజీ రావు ఒక పత్రికకు అధిపతి. “ఈనాడు” పేరుతో ఆయన చేసింది సమాజ సేవ కాదు, అది ఒక వ్యాపారం. ఇది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పాఠకులకు, దేశ, విదేశాల్లో  అందరికీ తెలిసిన వ్యవహారమే. ఉమ్మడి “తెలుగుదేశం”లో నాలుగు దశాబ్దాలుగా ఎన్ని పత్రికలు వచ్చాయనేది బహిరంగ రహస్యమే. తెలుగు రాష్ట్రాల్లో “ఈనాడు” వెలుగు, జిలుగులకు ఒక్క రామోజీ ఆలోచనలే కారణం అన్నట్టు ఆయన మరణానంతరం  విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. కానీ,”ఈనాడు” శీర్షికలు, వ్యాసాలు, సంపాదకీయాలు తదితరాల వెనుక…

Read More
furnichr c

“బోడి”ఫర్నిచర్ అప్పుడేమైంది..!

“బోడి ఫర్నిచర్”..ఈ మాట ఐదేళ్ళ కిందట గుర్తుకు వస్తే ఎంత బాగుండేదో. ఒక నిండు ప్రాణం ఈ రోజుకి బతికి ఇండేది. ఇది తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు, సామాన్య జనం గుర్తు చేస్తున్న అంశం. అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కక్ష సాధింపుల వైపు వెళ్ళక పోతే  ఆంద్రప్రదేశ్ లో ఈ రోజు వైసిపి స్థాయి వేరుగా ఉండేది. 2019లో అధికారం చేపట్టిన మరుక్షణమే జగన్ ప్రభుత్వం  కరకట్ట కూల్చివేతలు, కోడెల శివప్రసాద్…

Read More
hand fan c

చెల్లిని తీసేయండి – నేను చూసుకుంటా ?

ఆంధ్రప్రదేశ్ లో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూసిన జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.  ప్రజలు ఇచ్చిన “ఒక్క ఛాన్స్”ని ఐదేళ్ళ పాటు ఒంటెద్దు పోకడలతో చేజార్చుకున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించి అధికార పగ్గాలు సొంతం చేసుకున్న  తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ శ్రేణులతో జనంలోకి వెళ్ళలేని దుస్థితి నెలకొంది. అడ్డూ అదుపు లేని మాటలతో  వైసీపీని…

Read More
IMG 20240624 WA0075

అక్కడ మంత్రి – ఇక్కడ నిర్మాత…

కాలం చక్రం గమ్మత్తుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్, సుప్రియాల మొదటి చిత్రం “అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి”. అందరికీ తెలిసిన సంగతే. ఆ తర్వాత సుప్రియ తెర వెనక్కి వెళ్ళారు. పవన్ మాత్రం “పవార్ స్టార్”గా ఎదిగారు. ఇదీ తెలిసిన విషయమే. రెండు దశాబ్దాల తర్వాత ఇద్దరూ కెమెరా ముందు కనిపించారు. కానీ నటులుగా మాత్రం కాదు..పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో, సుప్రియ నిర్మాతగా కలుసుకున్నారు.

Read More
guruvinda cf

గుర్తు లేదా”గురివిందా”..!

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి వింత పోకడలు విస్తు కలిగిస్తున్నాయి. తెలంగాణ వచ్చి దశాబ్దం గడచిన ఉద్యమ ఆలోచనల నుంచి బయటపడని కొందరు నేతల అనాలోచిత నిర్ణయాలు భారాస అధిష్టానానికి ఒక రకంగా తలనొప్పి తీసుకు వస్తున్నాయి. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటే రాద్ధాంతం చేస్తున్న భారత రాష్ట్ర సమితి తీరు చూస్తుంటే గురివింద చందం గుర్తుకు వస్తోంది. ఉద్యమ పార్టీ పేరుతో 2014లో అధికారంలోకి వచ్చిన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అటు…

Read More
katha c

ముంచిన “కుటుంబ కథా చిత్రం”..!

జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీకి ఆంద్రప్రదేశ్ లో ఈ సారి కొత్త తరహా దెబ్బ తగిలింది. వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ గెలవడానికి, ఓడిపోవడానికి అక్కడి రాజకీయ సమీకరణలు కారణమైతే, ఆంధ్రాలో మాత్రం కేవలం కుటుంబ కలహాలు పార్టీ ఆశలను బూడిదలో పోశాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో ప్రతికూల వాతావరణం ఏర్పడిందని, దాన్ని అవకాశంగా మలచుకొని లబ్ధి పొందవచ్చనుకొని  కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పావులు…

Read More
kcr kavit c

ఫామ్ హౌస్ లో”కరెంటు”- జైలులో”మత్తు”.!

బుకాయించడంలో ఉద్యమ పార్టీ అధిపతులు ఒకరిని మించి మరొకరుగా ఉన్నారు.  హైదరాబాద్  నుంచి  కోట్ల రూపాయల ఢిల్లీ మద్యం కుంభకోణంలోకి పకడ్బందీగా పావులు కదిపిన కల్వకుంట్ల కవిత తీహార్ జైలు ఊసలు లెక్కబెట్టే వరకు ముడుపులతో ఏ మాత్రం సంబంధమే లేనట్టు మీటింగుల్లోనూ, మీడియా ముందూ బుకయించిన సంగతి అందరికీ తెలిసిందే. డేటా మొత్తాన్ని తొలగించి తనకేమీ తెలియదు అన్నట్టు ఫార్మాట్ చేసిన ఫోన్ లను విచారణ సంస్థల చేతిలో పెట్టిన ఆమె జైలు జీవితం నెలలు…

Read More
reviw c

ఇక్కడ”దోపిడీ”-అక్కడ”అరాచకం”..!

తెలుగు రాష్ట్రాల ప్రజలు నిజంగా తెలివైన వారే అని ప్రపంచానికి చాటారు.మాటలు ముఖ్యం కాదు, చేతలు కావాలని తేల్చి చెప్పారు. గత ఏడాది తెలంగాణ ఎన్నికల్లో ఉద్యమ పార్టీని చిత్తుగా ఓడించారు. మొన్న ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో వైసిపిని నామరూపాలు లేకుండా చేశారు. తెలంగాణలో “కారు”ని షెడ్డుకి పంపితే, ఆంధ్రాలో “ఫ్యాన్”గాలి సోకకుండా అదుపు చేశారు. అదే తెలుగు ప్రజల రాజకీయ చైతన్యం. అయితే, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, ఆంధ్రా రాష్ట్రంలో వైసిపి కుదేలు కావడానికి ఒకటే…

Read More
bjp wrong cf

గుడిని కూల్చడం సాధ్యమా…?

నాలుగు వందల స్థానాలు గెలుస్తామని ఢంకా బజాయించి మరీ ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధినేతల మాటల్లో అవేశం కనిపించడం ఆశ్చర్య పరుస్తోంది. దేశంలో మూడో దశ పోలింగ్ పూర్తీ అయిన తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆధిత్యనాథ్ లాంటి భాజాపా నేతల ప్రసంగాల్లో ఉహించని మార్పు కనిపిస్తోంది. ఈ నేతలు “ఇండియా కూటమి” పైనా, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మీద విసురుతున్న ఘాటైన విమర్శనాస్త్రాలు రాజకీయ పరిశీలకులను ఆలోచనల్లో పడేస్తున్నాయి….

Read More
amit suprim c

“సుప్రీమ్”ని ప్రశ్నించే ధైర్యమా…

ఎనిమిది, తొమ్మిదేళ్ళ కిందటి వరకు దేశ ప్రజలకు ఎవరో కూడా తెలియని వ్యక్తి ఈ రోజు న్యాయ వ్యవస్థను తప్పుపట్టే స్థాయికి చేరారు. ప్రజా స్వామ్య దేశం అందులోనూ పదేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నామన్న ఒకే ఒక ధైర్యంతో అధికారం,  పార్టీ బలం చూసుకొని షా  అదుపు లేకుండా మాట్లాడడం విస్మయానికి గురి చేస్తోంది. కేంద్రంలో బాధ్యత గల పదవిలో అంటూ దేశ ప్రధానికి కుడి భుజంగా పేరున్న అమిత్ షా ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలు,…

Read More
bjp slogn c

“నినాదం” లేని “కాషాయం”..!

దేశంలో మూడో సారి గద్దెనెక్కాలని ఆరాట పడుతున్న కమల దళానికి అమ్ముల పొదిలో బలమైన ప్రచార అస్త్రం కొరవడినట్టు కనిపిస్తోంది. మూడు దశాబ్దాలుగా “బాబ్రీ మసీదు – రామజన్మ భూమి” గళం ఎత్తుకొని అంచెలంచెలుగా ఎదిగిన భారతీయ జనతా పార్టీకి ఈ లోక్ సభ ఎన్నికల్లో “నమో” జపం తప్ప మరో నినాదం లేకుండా పోయింది. రామాలయాన్ని నిర్మించి తీరుతామన్న వాజపేయి, అద్వానీ, మోడీ వంటి నేతలు 1992 నుంచి చేస్తున్న హామీలకు మొన్న అయోధ్యలో ముగిసిన…

Read More